తండ్రితో పాటు తనయ.. | Father and daughter killed in road mishap | Sakshi
Sakshi News home page

తండ్రితో పాటు తనయ..

Published Wed, Oct 23 2013 4:52 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Father and daughter killed in road mishap

మాక్లూర్/బాల్కొండ, న్యూస్‌లైన్: దసరా పండుగ సెలవుల్లో కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపారు. సెలవులు ముగియడంతో తండ్రితో కలిసి సంతోషంగా బడిబాట పట్టారు. మరో అడుగు వేస్తే చాలు బళ్లోకి చేరుతామనగా.. వారిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది.
 
 ఈ ప్రమాదంతో తండ్రితో పాటు ఓ కుమార్తె చనిపోగా, మరో కుమార్తె తీవ్రంగా గాయపడింది. తమ్ముడి కుమారుడు, గ్రామానికి చెందిన పిల్లలూ గాయాలపాలయ్యారు. బాల్కొండ మండలం పోచంపాడ్ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంతో మాక్లూర్ మండలంలోని అమ్రాద్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. అమ్రాద్ గ్రామానికి చెందిన ఆసది బాలయ్య కరీంనగర్ జిల్లా వేములవాడ వీఆర్‌ఓగా పని చేస్తున్నారు. ఆయనకు సొంత ఆటో ఉంది. దీన్ని తమ్ముడు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. పిల్లల సెలవులు ముగియడంతో మంగళవారం వారిని బడికి పం పేందుకు తానే పిల్లలతో ఆటోలో పోచంపాడ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు బయల్దేరారు. బాలయ్యతో పాటు ఆయన కుమార్తెలు తనూజ, నిర్మల, తమ్ము డి కుమారుడు మురళీధర్, గ్రామానికి చెందిన విద్యార్థినులు సింధూజ(ఏడోతరగతి), మమత(ఐదోతరగతి)కూడా ఆటోలో ఉన్నారు. ఐదు నిమిషాలైతే గమ్యానికి చేరుతారనగా.. పోచంపాడ్ క్రాసింగ్ వద్ద వీరు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలయ్యతో పాటు ఆయన కుమార్తె తనూజ మృతిచెందారు. మురళీధర్, సింధూజలకు తీవ్రగాయాలు కాగా, నిర్మల, మమతలు స్వల్పంగా గాయపడ్డారు.
 
 నలుగురూ ఆడపిల్లలే..
 బాలయ్యకు నలుగురు ఆడపిల్లలే. వారిని విద్యావంతులను చేయాలనే తలంపుతో చదివిస్తున్నారు. పెద్దమ్మాయి ఉదయ ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుండగా, రెండో అమ్మాయి నిర్మల ఎనిమిదో, మూడవ అమ్మాయి తనూజ ఆరోతరగతి, నాల్గో అమ్మాయి మంజుల ఐదో తరగతి చదువుతున్నారు. ఇందులో తనూజ, నిర్మల పోచంపాడ్‌లో చదువుతున్నారు. సెలవులకు ముందు వరకు తమలో ఒకరిగా ఉన్న తనూజ రోడ్డు ప్రమాదంలో మరణించదంటే తోటి విద్యార్థులు జీర్ణించుకోలేక పోతున్నారు. రోడ్డు ప్రమాదం తండ్రీకూతుళ్లను బలిగొనడంతో అమ్రాద్‌లో విషాదం అలుముకుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement