నాయుడుపేట: వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి లారీ కిందపటంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా నాయుడుపేట శివారులో శుక్రవారం చోటుచేసుకుంది.
విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న లారీ 16వ నంబరు జాతీయ రహదారిలోని నాయుడుపేట జంక్షన్ వద్దకు రాగానే వేంగంగా వచ్చిన ద్విచక్రవాహనం లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు.
లారీ కిందికి దూసుకెళ్లిన బైక్: ఇద్దరి మృతి
Published Fri, Nov 6 2015 8:08 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement