హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కార‍్యనిర‍్వాహక కార‍్యదర్శి కూన వెంకటేష్ గౌడ్ ఆదివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడ్డారు. షిర్డీకి కారులో బయలుదేరిన ఆయన.. తుల్జాపూర్ వద‍్ద ప్రమాదానికి గురయ్యారు. కారు బెలూన‍్లు తెరుచుకోవడంతో కూన వెంకటేష్ గౌడ్ స‍్వల‍్ప గాయాలతో బయటపడ్డారు.