క్రైమ్: ఖమ్మం జిల్లా చీమలపాడు గ్రామంలో బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్ శ్రేణులు అత్యుత్సాహంతో బాణాసంచా కాల్చగా.. వేదికకు దగ్గర్లోని ఓ గుడిసెకు నిప్పంటుకోవడం, ఆర్పడానికి వెళ్లిన వాళ్లు అందులోని సిలిండర్ పేలి మృత్యువాత పడ్డారు. పలువురికి గాయాలు అయ్యాయి కూడా.
ఈ విషాదంతో ఆత్మీయ సమ్మేళనం రద్దు చేసుకుంది బీఆర్‌ఎస్. అయితే.. సమ్మేళనం కోసం వండిన వంటకాలను గ్రామ సమీపంలోనే పడేసి వెళ్లిపోయారు. దీంతో గ్రామంలోని కొన్ని పశువులు ఆ కుళ్లిపోయిన ఆహారాన్ని తిని అస్వస్థతకు గురయ్యాయి. మూడు ఆవులు మృతి చెందగా, మరికొన్నింటికి వైద్యం అందిస్తున్నారు.
నలుగురు గ్రామస్తుల మృతితో విషాదంలో ఉన్న తాము అక్కడ తిండి వదిలేసిన సంగతి గమనించలేదని, పశువులు నిత్యం అటువైపు మేతకు వెళ్తుండడంతో తాము పెద్దగా పట్టించుకోలేదని, ఇలా జరుగుతుందని అనుకోలేదని పశువుల యజమానులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment