గురుకుల పాఠశాలలో విచారణ
ఆత్మకూరురూరల్:
పట్టణంలోని ఏపీ బాలికల గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థినిపై పాఠశాల ప్రిన్సిపల్ అసభ్యకర ప్రవర్తనపై జిల్లా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ పాలనాధికారి కమలకుమారి శనివారం సాయంత్రం విచారణ నిర్వహించారు. గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ప్రిన్సిపాల్ రెండేళ్లుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వికృత చేష్టలు చేస్తున్నట్లు బాధిత విద్యార్థిని సమాచారం మేరకు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపడుతున్నట్లు పీవో కమలకుమారి తెలిపారు. ప్రిన్సిపల్ అందుబాటులో లేకపోవడం, బాధిత విద్యార్థిని సైతం తల్లిదండ్రులతో స్వగ్రామానికి వెళ్లడంతో, తోటి విద్యార్థినులను, ఉపాధ్యాయులను, ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ను విచారించినట్లు చెప్పారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ ఎం.వి.రమణ, సహాయ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కె.జ్యోత్సఆత్మకూరు ఎస్‌ఐ యం. పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.