ITDA PO
-
ఆదర్శమంటే ఆయనే: సర్కారు కాలేజీలో పీవో కుమారుడు
సీతానగరం (పార్వతీపురం): ఒకరికి ఏదైనా సలహా ఇచ్చేముందు మనమూ దాన్ని ఆచరించేందుకు సిద్ధంగా ఉండాలనే మాటను అక్షరాల పాటిస్తున్నారు పార్వతీపురం ఐటీడీఏ పీవో కూర్మనాథ్. తన పిల్లలను ప్రభుత్వ బడి, కళాశాలలో చదివిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవల పార్వతీపురం కేపీఎం మున్సిపల్ హైస్కూల్లో పదోతరగతి పూర్తిచేసిన కుమారుడు త్రివిక్రమ్‌ను గురువారం సీతానగరం మండలం జోగంపేటలో ఉన్న గిరిజన ప్రతిభ కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను ప్రభుత్వం నాడు–నేడు నిధులతో సుందరంగా తీర్చిదిద్దిందని, ప్రమాణాలతో కూడిన విద్యను బోధిస్తున్నారని, అందుకే గిరిజన కళాశాలలో తన కుమారుడిని చేర్పించానని ఆయన విలేకరులకు తెలిపారు. అనంతరం అక్కడి విద్యార్థులకు బ్యాగ్‌లు, మెటీరియల్, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఇవీ చదవండి: అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే.. ఇలాంటి పందుల పోటీలు ఎప్పుడైనా చూశారా? -
సాక్షి ఎఫెక్ట్: విధుల నుంచి ఐటీడీఏ పీవో తొలగింపు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉద్యోగం ఇప్పిస్తానని ప్రలోభపెట్టి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ యువతి ఆరోపించిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కేఆర్ పురం ఐటీడీఏ పీవో ఆర్వీ సూర్యనారాయణను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ కలెక్టర్ కార్తికేయ మిశ్రా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘ఐటీడీఏ పీవోపై లైంగిక ఆరోపణలు’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందించిన కలెక్టర్ ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించటంతోపాటు ఆయనపై చర్యలకు ఉపక్రమించారు. ఐటీడీఏ బాధ్యతలను జంగారెడ్డిగూడెం ఆర్డీవో వైవీ ప్రసన్నలక్ష్మికి అప్పగించారు. మరోవైపు పోలీసులు కూడా ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు. ఇదిలావుండగా పీవోకు అనుకూలంగా ఓ వర్గం రంగంలోకి దిగి ఇకపై ఎవరూ ఆయనపై ఫిర్యాదు చేయకుండా బాధితులను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించారు. శనివారం ఉదయం కూడా పీవోపై ఆరోపణలు చేసిన సదరు యువతి సాయంత్రానికి మాట మార్చింది. తనను కొంతమంది బ్లాక్మెయిల్ చేసి పీవోకు వ్యతిరేకంగా చెప్పించారంటూ మరో వీడియో విడుదల చేసింది. చదవండి: దారుణంగా హత్య చేసి.. గుంతలో పడేసి.. గుంటూరులో సైకో వీరంగం -
సాక్షి ఎఫెక్ట్: కొండలెక్కిన పీఓ..
సాలూరు: ఆయనో జిల్లా స్థాయి అధికారి.. ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకోవాలనే ఉత్సాహంతో కొండ కోనల్లో పర్యటించారు. కిలోమీటర్ల కొద్దీ నడిచి గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి ఇబ్బందులను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. గిరిజనుల ఇబ్బందులపై ఈ నెల 25న ‘అరణ్య రోదన’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఐటీడీఏ పీఓ కూర్మనాథ్, ఇతర అధికారులు స్పందించారు. కొదమ పంచాయతీ పర్యటనకు బయలుదేరిన అధికారులు చింతామల జంక్షన్ వరకు చేరుకున్నారు. గ్రామస్తులు చందాలు పోగుచేసుకుని నిర్మించుకున్న రోడ్డు చినుకులకు బురదమయంగా మారడంతో వాహనాలు ముందుకెళ్లలేదు. దీంతో పీఓ కూర్మనాథ్, తదితరులు సుమారు మూడు కిలోమీటర్లు నడిచి చింతామల.. మరలా వెనుకకు వచ్చి బల్ల జంక్షన్ నుంచి మరో 5 కిలోమీటర్లు నడుచుకుని కొదమ పంచాయతీ గ్రామానికి చేరుకున్నారు. చింతామల, కొదమ గ్రామాలలో ప్రజలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. అయితే గిరిజనులకు తెలుగు అంతగా రాకపోవడంతో స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు చోడిపల్లి బీసు ప్రజల మాటలను అధికారులకు.. అధికారుల వివరణను ప్రజలకు తర్జుమా చేసి చెప్పారు. రోడ్లు, తాగునీటి సదుపాయం కల్పించడంతో పాటు పాఠశాల, అంగన్వాడీ భవనాలు, చెక్‌డ్యామ్‌లు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరారు. దీనికి పీఓ స్పందిస్తూ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర సూచనల మేరకు ఇక్కడి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వచ్చినట్లు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా నంద నుంచి చింతామలకు రోడ్డు మంజూరైందని.. అయితే ఈ నిర్మాణం ఎందుకు పూర్తికాలేదో కారణాలు తెలుసుకుని పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. గిరిజన గ్రామాల్లో రహదారులు, వైద్యం, విద్యలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. చందాలతో వేసుకున్న చింతామల రోడ్డుకు సంబంధించి వారం రోజుల్లో ఉపాధి హామీ పథకం ద్వారా బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వచ్చే నెల 1వ తేదీన ప్రభుత్వ రేషన్ బియ్యం ఈ రెండు గ్రామాల్లో పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అటవీశాఖ అడ్డంకుల వల్ల గిరిశిఖర గ్రామాల్లో రహదారుల నిర్మాణం ముందుకు సాగడం లేదని, అధికారులు దీనిపై దృష్టి సారించాలని వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి దండి శ్రీనువాసరావు కోరారు. గిరిజనులతో సహపంక్తి భోజనం.. కొదమలో స్థానిక గిరిజన నాయకులు ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనంలో పీఓ కూర్మనాథ్, తదితరులు పాల్గొన్నారు. పీఓ తన వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలను అక్కడి చిన్నారులు, మహిళలకు అందించారు. అలాగే ప్రజాచైతన్య వేదిక కన్వీనర్ కూనిశెట్టి అప్పలనాయుడు సమకూర్చిన రూ. 25 వేల నగదును యువతకు అందజేశారు. ఈ పర్యటనలో పీఓ కూర్మనాథ్ తన కుమారుడిని తీసుకువచ్చి గిరిజనుల ఆహార వ్యవహారాలు, కష్టసుఖాలను వివరించారు. కార్యక్రమంలో ఐటీడీఏ డీడీ కిరణ్‌కుమార్, డ్వామా పీడీ నాగేశ్వరరావు, తహసీల్దార్ ఇబ్రహీం, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
గాడిలోకి పాలన..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కొత్త ప్రభుత్వం జిల్లా పరిపాలన యంత్రాంగాన్ని గాడినపెట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే జిల్లా పోలీసు బాస్‌ను మార్పు చేయడంతో తొలి అడుగు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఐఏఎస్ అధికారులనూ బదిలీ చేసింది. శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న కేవీఎన్ చక్రధరబాబును బదిలీచేస్తూ ఏపీ ట్రాన్స్‌కోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఆయన స్థానంలో 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.శ్రీనివాసులుకు పోస్టింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన విశాఖ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) పథక సంచాలకుడిగా పనిచేస్తున్నారు. అలాగే సీతంపేట సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తున్న 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి లోతేటి శివశంకర్ విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన స్థానంలో 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సీఎం సాయికాంత్ వర్మను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం డివిజన్ సబ్‌కలెక్టర్‌గా వర్మ పనిచేస్తున్నారు. తొలి నుంచీ వివాదాలే.. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పీవోగా పనిచేస్తూ 2016 నవంబరు 16వ తేదీన కేవీఎన్ చక్రధరబాబు జాయింట్ కలెక్టరుగా బదిలీపై వచ్చారు. 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా జిల్లా పరిపాలన వ్యవస్థలో తనదైన ముద్ర వేస్తారని ప్రజలు ఆశించినప్పటికీ ఆ స్థాయిలో సేవలు అందించలేకపోయారు. తొలిరోజుల్లోనే రెవెన్యూ విభాగంలో ఉద్యోగులతో ముఖ్యంగా తహసిల్దార్లతో వివాదాలు తెచ్చుకున్నారు. ఉద్యోగులు ఒకరోజు విధులను సైతం బహిష్కరించి జిల్లా కలెక్టరేట్‌కు సమీపంలోని ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద నిరసన తెలిపారు. అప్పటి జిల్లా కలెక్టర్‌గా ఉన్న పి.లక్ష్మీనరసింహం ఈ వివాదం సద్దుమణిగేలా చేశారు. వంశధార, ఆఫ్‌షోర్ ప్రాజెక్టులతోపాటు కొవ్వాడ అణువిద్యుత్తు కేంద్రం నిర్వాసితులకు పరిహారం ప్యాకేజీల చెల్లింపుల్లో చోటుచేసుకున్న అవకతవకలను చక్రధరబాబు నిలువరించలేకపోయారు. ఈ వ్యవహారంలో టీడీపీ నాయకుల అండతో చెలరేగిపోయిన అవినీతిపరులకు ఆయన అండగా ఉన్నారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. తిత్లీ తుఫానుతో జిల్లాలో ఉద్దానం ప్రాంతమంతా దెబ్బతిన్నప్పుడు బాధితులను సకాలంలో ఆదుకునే విషయంలో సరైనరీతిలో స్పందించలేదనే విమర్శలు ఆయనపై వచ్చాయి. అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల వ్యవహారంలో ఏకపక్షంగా వ్యవహరించారని జిల్లా రెవెన్యూ వర్గాలు మల్లగుల్లాలు పడ్డారు. ఇవన్నీ గుర్తించే ప్రభుత్వం ఆయన్ను అంతగా ప్రాధాన్యత లేని శాఖకు బదిలీ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐటీడీఏలో తనదైన ముద్ర... సీతంపేట ఐటీడీఏ పీవో పోస్టులో ఐఏఎస్ అధికారిని నియమించడం లోతేటి శివశంకర్తోనే మొదలైంది. 2016 నవంబరు 16న పీవోగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఈ పోస్టులో సుదీర్ఘకాలం పనిచేసిన అధికారిగా గుర్తింపుపొందారు. జిల్లా పర్యాటక రంగంలో సీతంపేటకు స్థానం కల్పించడంలో తనదైన పాత్ర పోషించారు. అడ్వంచర్ పార్కు, మెట్టుగూడ జలపాతం వద్ద పర్యాటకులకు వసతులు కల్పించారు. హెచ్‌ఎన్‌టీసీ నర్సరీలో మన్యం ఎకో పార్కును తీర్చిదిద్దడానికి చర్యలు చేపట్టారు. పీఎంఆర్సీలో గిరిజన మ్యూజియం ఏర్పాటుకు కృషి చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ‘నెలనెలా వెన్నెల’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అదే సమయంలో ఆయనపై కూడా పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. పర్యాటక రంగం అభివృద్ధి పనుల్లో అక్రమాలకు తావిచ్చారనే విమర్శలు వచ్చాయి. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఆ పార్టీ మంత్రులు, నాయకులకు కొమ్ముకాశారని గిరిజన సంఘాలు నిరసన తెలిపిన సందర్భాలు ఉన్నాయి. జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు... శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన డాక్టర్ కె.శ్రీనివాసులు వెటర్నరీ సైన్స్ (పశువైద్యం)లో పట్టభద్రుడు. 2007 సంవత్సరంలో గ్రూప్–1కు ఎంపికయ్యారు. డిప్యూటీ కలెక్టరుగా నరసారావుపేట, రాజంపేట, జంగారెడ్డిగూడెంలో పనిచేశారు. డీఆర్డీఏ, డ్వామా పీడీగానూ బాధ్యతలు నిర్వర్తించారు. పులిచింతల ప్రాజెక్టు ప్రత్యేక డిప్యూటీ కలెక్టరుగా పనిచేశారు. ఐఏఎస్‌గా పదోన్నతి పొందిన ఆయన ప్రస్తుతం విశాఖ జిల్లా డీఆర్డీఏ పీడీగా పనిచేస్తున్నారు. బదిలీపై శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టరుగా వస్తున్నారు. రెండ్రోజుల్లో విధుల్లో చేరతానని ‘సాక్షి’కి చెప్పారు. ఐటీఏడీ పీవో సీఎం సాయికాంత్ వర్మ... కర్నూలు జిల్లాకు చెందిన సాయికాంత్ వర్మ మద్రాస్ ఐఐటీలో ఎంటెక్ చదివారు. 2014 సంవత్సరంలో సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 18వ ర్యాంకు సాధించారు. అదీ తొలి ప్రయత్నంలోనే పొందడం విశేషం. తొలి పోస్టింగ్‌లో రాజమహేంద్రవరం సబ్‌కలెక్టరుగా నియమితులయ్యారు. 2017 అక్టోబరు 4వ తేదీ నుంచి ఈ పోస్టులో 20 నెలల పాటు పనిచేశారు. అక్కడి నుంచి సీతంపేట ఐటీడీఏ పీవోగా బదిలీ అయ్యారు. -
చింతూరు ఐటీడీఏ తొలి పీఓగా చినబాబు
చింతూరు: స్థానిక ఐటీడీఏ తొలి ప్రాజెక్టు అధికారి (పీఓ)గా గుగ్గిలి చినబాబును నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన అనంతరం విలీన మండలాల ప్రజల సౌకర్యార్థం ఈ ఏడాది ఏప్రిల్‌లో చింతూరులో ఐటీడీఏ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుండి రంపచోడవరం పీఓ కేవీఎ¯ŒS చక్రధరబాబు ఇ¯ŒSఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం చినబాబు విజయవాడలోని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు ఆయన రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో ఏపీఓ జనరల్‌గా, చింతూరు మండల ప్రత్యేకాధికారిగా పనిచేశారు. చినబాబు మాట్లాడుతూ విలీన మండలాల ప్రజల సమస్యలు తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. -
మేట్రిన్ అవకతవకలపై ఐటీడీఏ పీఓ విచారణ
మనుబోలు : మనుబోలు ఎస్సీ బాలుర వసతి గృహంలో గతంలో మేట్రిన్‌గా పనిచేసి అవకతవకలకు పాల్పడి సస్పెండ్ అయిన మాధవిపై ఐటీడీఏ పీఓ కమలకుమారి శనివారం విచారణ చేపట్టారు. సుమారు సంవత్సరం క్రితం ఎస్సీ బాలుర వసతి గృహంలో మేట్రిన్‌గా పనిచేసిన మాధవి పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అప్పటి కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలతో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధవి సమక్షంలోనే విచారణ చేపట్టిన కమలకుమారి హాస్టల్‌కు చేరుకుని పాత రికార్డులు పరిశీలించారు. విద్యార్థులను, సిబ్బందిని ఆరా తీశారు. మాధవి పని తీరుపై నివేదిక తయారు చేసి కలెక్టర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. ఆమె వెంట ఐటీడీఏ సూపరింటెండెంట్ దిలీప్‌కుమార్, నవీన్‌కుమార్, ఏఎస్డబ్ల్యూఓ ప్రభుదాస్, ప్రస్తుతం హాస్టల్ వార్డన్ పద్మనాభరెడ్డి ఉన్నారు. -
గురుకుల పాఠశాలలో విచారణ
ఆత్మకూరురూరల్: పట్టణంలోని ఏపీ బాలికల గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థినిపై పాఠశాల ప్రిన్సిపల్ అసభ్యకర ప్రవర్తనపై జిల్లా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ పాలనాధికారి కమలకుమారి శనివారం సాయంత్రం విచారణ నిర్వహించారు. గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ప్రిన్సిపాల్ రెండేళ్లుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వికృత చేష్టలు చేస్తున్నట్లు బాధిత విద్యార్థిని సమాచారం మేరకు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపడుతున్నట్లు పీవో కమలకుమారి తెలిపారు. ప్రిన్సిపల్ అందుబాటులో లేకపోవడం, బాధిత విద్యార్థిని సైతం తల్లిదండ్రులతో స్వగ్రామానికి వెళ్లడంతో, తోటి విద్యార్థినులను, ఉపాధ్యాయులను, ఇన్చార్జి ప్రిన్సిపల్‌ను విచారించినట్లు చెప్పారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ ఎం.వి.రమణ, సహాయ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కె.జ్యోత్సఆత్మకూరు ఎస్ఐ యం. పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. -
గిరిజన సంక్షేమ శాఖ డీడీ సరెండర్
ఏటూరునాగారం : గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ పోచం అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను మాతృశాఖకు సరెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్పెషల్ డీఎస్సీ 2012–13కు సంబంధించిన ఉపాధ్యాయ పోస్టుల్లో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ పోచం పది మంది గిరిజన అభ్యర్థులను నియమించార న్నారు. అయితే ప్రాథమిక విచారణలో ఆ నియామకాలు ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా జరిగాయని, అలాగే ఉన్నతాధికారుల పేర్లు చెప్పి అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు రావడంతో.. కలెక్టర్ కరుణ ఆయనను మాతృశాఖ గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌కు సోమవారం సరెండర్ చేశారన్నారు. అలాగే టీడీడబ్ల్యూఓ చందన్‌కు డీడీగా పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారన్నారు. కాగా, డీడీ పోచం హయాంలో జరిగిన అన్ని నియామకాలను ఒక సీనియర్ అధికారి ద్వారా విచారించేందుకు నిర్ణయించినట్లు పీఓ తెలిపారు. -
పని చేయకుంటే సెలవుపై వెళ్లండి : పీవో
సీతంపేట : సక్రమంగా పని చేయకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలని ఉపాధి హామీ సిబ్బందికి ఐటీడీఏ పీవో జల్లేపల్లి వెంకటరావు హెచ్చరించారు. ఐటీడీఏలో టెలీ కాన్ఫరెన్స్ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతంపేట మండలంలో ఇంకుడు గుంతలు పూర్తి చేయడంలో బాగా వెనుకబడ్డారని తెలిపారు. మళ్లీ వచ్చే టెలీకాన్ఫరెన్స్‌కు ప్రోగ్రెస్ చూపించకపోతే సస్పెన్షన్ వేటు తప్పదని తెలిపారు. పదేపదే చెబుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇదే కొనసాగితే క్రమశిక్షణా చర్యలు తప్పవన్నారు. సమావేశంలో ఏపీడీ రామారావు, డీపీవో వై.సతీష్‌కుమార్, హార్టీకల్చర్ ఏపీవోలు శంకరరావు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశ కార్యకర్తలు కీలకం
ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్ ఉట్నూర్ ఆశ కార్యకర్తల సమ్మేళనం ఉట్నూర్ : ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లో వ్యాధులు, జ్వరాలు అరికట్టడంలో ఆశ కార్యకర్తలు నిర్వర్తించే పాత్ర కీలకమైనదని ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్ అన్నారు. వర్షకాలంలో సీజన్ వ్యాధులు ప్రబలుతున్నందున్న ఎల్లప్పుడు ఆశ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గురువారం మండల కేంద్రంలోని హెచ్‌కేజీఎన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆశ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో జ్వరాలు, వ్యాధులు ప్రబలినప్పుడు వెంటనే సంబంధిత వైద్యాధికారులకు సమాచారం అందించడంతోపాటు ప్రాథమిక చికిత్స అందించాలని చెప్పారు. గిరిజన గ్రామాల్లో ఇంటింటా పర్యటిస్తూ పారిశుధ్యం లోపించకుండా తీసుకోవాల్సిన చర్యలు, దోమల నివారణకు చేపట్టాల్సిన చర్యలు వివరించాలని పేర్కొన్నారు. గర్భిణులు ఆస్పత్రుల్లో ప్రసవం అయ్యేలా అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లో దోమల నివారణకు కాంట్రాక్టర్ల ద్వారా కాకుండా వీటీడీఏ, ఆశ కార్యకర్తల ఆధ్వర్యంలో స్ప్రే చేయిస్తామని, అందుకు సంబంధించిన నిధులు ఆశ కార్యకర్తల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. జ్వరాలు ప్రబలితే ఆర్డీ కీట్స్ ద్వారా పరీక్షలు నిర్వహించి వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపించేలా చర్యలు చేపడితే రూ.50 ప్రోత్సాహకంగా అందిస్తామని తెలిపారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 18 మంది ఆశ కార్యకర్తలకు ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆశరెడ్డి, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్‌రెడ్డి, ఏఎమ్‌వో వెంకటేశ్వర్లు, వైద్యులు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
27న ఐటీడీఏ పాలకవర్గ సమావేశం
ఉట్నూర్ : ఈ నెల 27న ఐటీడీఏ పాలకవర్గం సమావేశం కేబీ ప్రాంగణంలోని పీఏమ్మార్సీ భవనంలో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీవో కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా శాఖల అధికారులు పూర్తి సమాచారంతో సకాలంలో హాజరు కావాలని పేర్కొన్నారు. -
ఐటీడీఏ పీవో బదిలీ
భద్రాచలం : ఖమ్మం జిల్లా భద్రాచలం ఐటీడీఏ పీవో దేవరాజన్ దివ్య బదిలీ అయ్యారు. నిజామాబాద్ జాయింట్ కలెక్టర్‌గా ఆమెను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 2014 ఫిబ్రవరి 14న భద్రాచలం ఐటీడీఏ పీవోగా బాధ్యతలు చేపట్టిన దివ్య ఏడాది తిరగక ముందే బదిలీ కావటం గమనార్హం. అయితే ఐటీడీఏ పీవోగా దివ్య తనదైన ముద్ర వేసుకున్నారు. ఇక్కడ విధుల్లో చేరిన కొన్ని రోజులకే సాధారణ ఎన్నికలు రాగా.. అశ్వారావుపేట నియోజకవర్గ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాల నిర్వహణలో తనదైన పాత్ర పోషించి, ఉత్సవాల విజయవంతానికి సహకరించారు. మధ్య దళారులు లేకుండా చేయాలనే తలంపుతో 'ప్రజావాణి' పేరిట యూనిట్ అధికారులందరినీ గిరిజనుల ముంగిటకు పంపించారు. ప్రతి సోమవారం ఐటీడీఏలో నిర్వహించే గిరిజన దర్బార్‌ను ప్రజావాణిగా మార్చి, గిరిజనుల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తుకు యూనిట్ అధికారులు జవాబుదారులుగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ చూపారు. కార్యాలయానికే పరిమితం కాకుండా గిరిజన గ్రామాల్లో పర్యటనపై ఎక్కువ శ్రద్ధ చూపారు. కొండరెడ్డి గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక నిధులు కేటాయించారు. గిరిజనుల వైద్య సేవలకు పెద్ద దిక్కుగా ఉన్న భద్రాచలం ఏరియా ఆస్పత్రి ఆధునీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఐటీడీఏ నుంచి నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలను కల్పించారు. ైవె ద్యం కోసం వచ్చే వారికి ఇబ్బంది కలుగకుండా అక్కడ నెలకొన్న వర్గపోరుకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆస్పత్రి సూపరింటెండెంట్ మార్పు విషయంలో ఆమె కోటిరెడ్డికి మద్దతుగా నిలిచి పైస్థాయిలో తన వాదన వినిపించారు. రాష్ట్ర విభజనతో విలీన మండలాల్లో ఉన్న ఎటపాక విద్యా సంస్థలను తిరిగి వెన క్కు తీసుకురావడం, భద్రాచలం నుంచి పర్ణశాలకు వెళ్లే దారిలో ఉన్న గ్రామాలను తెలంగాణలో క లపడంపై వాదన గట్టిగానే వినిపించారు. మితిమీరిన స్వేచ్ఛతో గాడితప్పిన పాలన... గతంలో ఏ అధికారీ ఇవ్వనంత రీతిలో దివ్య యూనిట్ అధికారులకు స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో పాలన గాడితప్పిందనే విమర్శలు ఉన్నాయి. గిరిజనులకు మేలు జరగాలనే ఆకాంక్ష కొంత నిధుల దుబారాకు దారితీసిందనే విమర్శ ఉంది. వివిధ పథకాల కింద వచ్చిన నిధుల ద్వారా గిరిజనలకు మేలు చేకూరితే చాలన్న రీతిలో యూనిట్ అధికారులు అడిగిందే తడవుగా నిధులు కేటాయించారు. అయితే అవి క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో పర్యవేక్షించలేకపోయారనే అపవాదు ఆమెపై ఉంది. ఆశ్రమ పాఠశాలలు, ఉపాధి హామీ పథ కం, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ద్వారా చేపట్టిన వివిధ నిర్మాణాలపై క్షేత్ర స్థాయిలో దృష్టి సారించలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో పనిచేసిన పీవోలు క్షేత్ర స్థాయి పర్యటనలు చేసిన సందర్భాల్లో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యహరించే వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. కానీ దివ్య మాత్రం విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, ఉద్యోగులపై కూడా ఉదాసీనంగా వ్యవహరించారనే విమర్శ ఉంది. దివ్య బయోడేటా జన్మస్థలం తమిళనాడులోని తిరుచ్చి జిల్లా కేంద్రం. తల్లిదండ్రులు నందిని, దేవరాజన్. తల్లి డెంటిస్ట్. తండ్రి తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డులో రిటైర్డ్ఇంజనీర్ 12వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో చెన్నైలోని సింథి మోడల్స్కూల్లో, అనంతరం ఇంజనీరింగ్‌లో బిట్స్ పిలానీలో సీటు సాధించి రాజస్థాన్‌లో 2006లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 2007లో సివిల్స్ రాసి 503 ర్యాంకు సాధించా రు. ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీసెస్‌లో చేరి బరోడాలో శిక్షణ తీసుకుంటూనే రెండవ సారి 2009లో సివిల్స్‌లో జాతీయ స్థాయిలో 37వ ర్యాంక్ సాధించారు. ఉత్తరాఖండ్‌లోని లాల్‌బహదూర్‌శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణ పూర్తి చేసుకొని కృష్ణా జిల్లా ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. అనంతరం భువనగిరి సబ్‌కలెక్టర్‌గా, ఆ తర్వాత హైదరాబాద్ ఈ గవర్నెన్స్ డైరక్టర్‌గా, 2014 ఫిబ్రవరి 14న భద్రాచలం ఐటీడీఏ పీవోగా బాధ్యతులు చేపట్టారు. 2008లో బెంగాల్‌కు చెందిన సుధిప్పోను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన బిట్స్ ఫిలానీలో ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. -
పీవోను బదిలీ చేయూలి
ఉట్నూర్, న్యూస్‌లైన్ : గిరిజనుల సమస్యలు, అభివృద్ధిని పట్టించుకోని ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్‌ను ఇక్కడి నుంచి బదిలీ చేయూలని ఆదివాసీ, గిరిజన, ప్రజాసంఘాల నాయకులు మర్సకోల తిరుపతి, సిడాం శంభు, అత్రం తిరుపతి, బొజ్జు డిమాండ్ చేశారు. పీవో వైఖరిని వ్యతిరేకిస్తూ నాయకులు సోమవారం ఐటీడీఏ ముట్ట డి తలపెట్టారు. అరుుతే పీవో కొమురం భీమ్ ప్రాంగణంలో నిర్వహించే గిరిజన దర్బార్‌కు తరలివెళ్లడంతో ఆయూ సంఘాల నేతలు ము ట్టడి విరమించుకుని కేబీ ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రధాన ద్వారం వద్ద బైఠారుుంచారు. పీవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పీవో నివాస్ గిరిజనుల అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆరోపించారు. గిరిజనులు అనేక సమస్యలతో సతమతమవుతున్నా ఆయన పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఐటీడీఏ పరిధిలోని వివిధ శాఖల ఉద్యోగులను చిన్నచిన్న కారణాలతో సస్పెండ్ చేస్తూ నిరంకుశత్వాన్ని చాటుతున్నారని తెలిపారు. ఎలాంటి విచారణ చేపట్టకుండానే సస్పెండ్ చేయడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. సస్పెండైన వారికి నెలలు గడుస్తున్నా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని పేర్కొన్నారు. సమస్యలు చెప్పుకుందామని గిరిజను లు క్యాంప్ కార్యాలయూనికి వస్తే పీవో గేటుకు తాళం వేరుుంచి ఎవరినీ లోనికి రానివ్వకుండా పనులు చేసుకుంటున్నాడని విమర్శించారు. కొమురం భీమ్ వర్ధంతి వేడుకలకు సంబంధించిన బిల్లు ఇంతవరకు విడుదల చేయూలని విమర్శించారు. గిరిజనుల మనోభావాలు గుర్తించని అధికారి తమకు అవసరం లేదని, ప్రభుత్వం వెంటనే బదిలీ చేయూలని డిమాండ్ చేశారు. తమ పోరాటం గిరిజనులకు సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమైన ఐటీడీఏ పీవోకు వ్యతిరేకంగా మాత్రమేనని పేర్కొన్నారు. పీవో వైఖరికి నిరసనగా ఈ నెల 26న ఏజెన్సీ బంద్ పాటిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు చేరుకుని ఆందోళన నిర్వహిస్తున్న నాయకులను అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. ఆయూ సంఘాల నాయకులు కుడ్మెత తిరుపతి, జేపీ నాయక్, నాయకులు జైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.