ఉట్నూర్, న్యూస్‌లైన్ : గిరిజనుల సమస్యలు, అభివృద్ధిని పట్టించుకోని ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్‌ను ఇక్కడి నుంచి బదిలీ చేయూలని ఆదివాసీ, గిరిజన, ప్రజాసంఘాల నాయకులు మర్సకోల తిరుపతి, సిడాం శంభు, అత్రం తిరుపతి, బొజ్జు డిమాండ్ చేశారు. పీవో వైఖరిని వ్యతిరేకిస్తూ నాయకులు సోమవారం ఐటీడీఏ ముట్ట డి తలపెట్టారు. అరుుతే పీవో కొమురం భీమ్ ప్రాంగణంలో నిర్వహించే గిరిజన దర్బార్‌కు తరలివెళ్లడంతో ఆయూ సంఘాల నేతలు ము ట్టడి విరమించుకుని కేబీ ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రధాన ద్వారం వద్ద బైఠారుుంచారు. పీవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పీవో నివాస్ గిరిజనుల అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆరోపించారు. గిరిజనులు అనేక సమస్యలతో సతమతమవుతున్నా ఆయన పట్టించుకోవడంలేదని విమర్శించారు.
ఐటీడీఏ పరిధిలోని వివిధ శాఖల ఉద్యోగులను చిన్నచిన్న కారణాలతో సస్పెండ్ చేస్తూ నిరంకుశత్వాన్ని చాటుతున్నారని తెలిపారు. ఎలాంటి విచారణ చేపట్టకుండానే సస్పెండ్ చేయడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. సస్పెండైన వారికి నెలలు గడుస్తున్నా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని పేర్కొన్నారు. సమస్యలు చెప్పుకుందామని గిరిజను లు క్యాంప్ కార్యాలయూనికి వస్తే పీవో గేటుకు తాళం వేరుుంచి ఎవరినీ లోనికి రానివ్వకుండా పనులు చేసుకుంటున్నాడని విమర్శించారు. కొమురం భీమ్ వర్ధంతి వేడుకలకు సంబంధించిన బిల్లు ఇంతవరకు విడుదల చేయూలని విమర్శించారు. గిరిజనుల మనోభావాలు గుర్తించని అధికారి తమకు అవసరం లేదని, ప్రభుత్వం వెంటనే బదిలీ చేయూలని డిమాండ్ చేశారు. తమ పోరాటం గిరిజనులకు సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమైన ఐటీడీఏ పీవోకు వ్యతిరేకంగా మాత్రమేనని పేర్కొన్నారు. పీవో వైఖరికి నిరసనగా ఈ నెల 26న ఏజెన్సీ బంద్ పాటిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు చేరుకుని ఆందోళన నిర్వహిస్తున్న నాయకులను అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. ఆయూ సంఘాల నాయకులు కుడ్మెత తిరుపతి, జేపీ నాయక్, నాయకులు జైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
పీవోను బదిలీ చేయూలి
Published Tue, Dec 24 2013 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM
Advertisement
Advertisement