మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో
సీతంపేట : సక్రమంగా పని చేయకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలని ఉపాధి హామీ సిబ్బందికి ఐటీడీఏ పీవో జల్లేపల్లి వెంకటరావు హెచ్చరించారు. ఐటీడీఏలో టెలీ కాన్ఫరెన్స్ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతంపేట మండలంలో ఇంకుడు గుంతలు పూర్తి చేయడంలో బాగా వెనుకబడ్డారని తెలిపారు. మళ్లీ వచ్చే టెలీకాన్ఫరెన్స్‌కు ప్రోగ్రెస్ చూపించకపోతే సస్పెన్షన్ వేటు తప్పదని తెలిపారు. పదేపదే చెబుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇదే కొనసాగితే క్రమశిక్షణా చర్యలు తప్పవన్నారు. సమావేశంలో ఏపీడీ రామారావు, డీపీవో వై.సతీష్‌కుమార్, హార్టీకల్చర్ ఏపీవోలు శంకరరావు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.