పెదవాగు ప్రాజెక్ట్ ఆశ్రమ పాఠశాలలోని నిఘా కెమెరాల్లో నమోదైన దృశ్యాలు
సాక్షి, అశ్వారావుపేటరూరల్: ఆశ్రమ, గురుకుల పాఠశాలలపై ప్రభుత్వం ‘నిఘా’ వేసింది. ఇక్కడి పిల్లల సంక్షేమం, రక్షణను దృష్టిలో ఉంచుకుని నిఘా నేత్రాలు(సీసీ కెమెరాలు) ఏర్పాటు చేసింది. ఈ పాఠశాలల్లో విద్యార్థినీవిద్యార్థుల భద్రత, ఉద్యోగుల పనితీరును పరిశీలించేందుకు, ప్రభు త్వం అందిస్తున్న బియ్యం, ఇతర సామగ్రి పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఈ కెమెరాలు ఉపయోగపడతాయి. మండలంలోని సున్నంబట్టి, పెదవాగు ప్రాజెక్ట్, అనంతారం, కావడిగుండ్లతోపాటు అశ్వారావుపేటలోని గిరిజన బాలుర, బాలికల ఆశ్రమ పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేశారు.
ఒకొక్క పాఠశాలకు నాలుగు సీసీ కెమెరాలు, ఒ కొక్క కంప్యూటర్ చొప్పున ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలను హైదారాబాద్‌లోగల కమిషనర్ కా ర్యాలయానికి అనుసంధానించారు. ఇక్కడ ఏం జ రుగుతోందో... హైదరాబాద్‌లోని ఉన్నతాధికా రు లు కూడా చూడొచ్చు. ఆయా పాఠశాలలు, గురుకుల పాఠశాలను పర్యవేక్షించేలా ఏర్పాట్లు చే శా రు. దీనిపై తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment