సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నుంచి ఉప్పుడు బియ్యాన్ని కొనుగోలు చేయరాదని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నిర్ణయించిందని ఆహార, పౌర సరఫరాల శాఖమంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. తమ వద్ద ఉప్పుడు బియ్యం నిల్వలు అధికం గా ఉండడంతో పాటు వీటి వినియోగం తక్కు వగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపిందన్నారు. శుక్రవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ భానుప్రసాద్ అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
దీనికి సంబంధించి శాఖాపరంగా తాము పలు ప్రత్యామ్నాయ చర్యలను తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2021–22 యాసంగిలో వరి సాగు చేపట్టవద్దని రైతులకు సలహా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ యాసంగిలో శనగలు, వేరుశనగ, నువ్వులు, పెసలు, మినుములు, ఆముద, కూరగాయలు ఇతర పంటలు పండించవచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment