Hyderabad: High Court Retired Judges As Commissioner To Enquiry Bandi Sanjay - Sakshi
Sakshi News home page

బండి సంజయ్‌ విచారణకు కోర్టు కమిషనర్‌ 

Published Tue, Aug 1 2023 4:37 AM | Last Updated on Tue, Aug 1 2023 7:55 PM

Hyderabad: High Court Retired Judges As Commissioner To Enquiry Bandi Sanjay - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఎన్నికను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌లో బండి సంజయ్‌ విచారణకు హైకోర్టు రిటైర్డ్‌ జిల్లా జడ్జి శైలజను కోర్టు కమిషనర్‌గా నియమించింది. ఈనెల 12 నుంచి 17 వరకు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గత ఎ­న్నికల్లో కరీంనగర్‌ నుంచి గంగుల బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచారు.

అయితే అఫిడవిట్‌లో గంగు­ల తప్పుడు వివరాలు ఇచ్చారని, అందువల్ల ఆయన ఎన్ని­క­  చెల్లదని తీర్పు ఇవ్వాలంటూ స­మీప³ ప్రత్యర్థి బండి సంజయ్‌ 2019 జనవరిలో పిటిషన్‌ వేశారు. దీనిపై జస్టిస్‌ చిల్లకూర్‌ సుమలత సోమవారం మళ్లీ విచారణ చేపట్టారు. వాదనల అనంతరం కోర్టు కమిషనర్‌ను క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు నియమిస్తూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement