సాక్షి, హైదరాబాద్/ కరీంనగర్: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. 2018లో కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు బుధవారం కొట్టివేసింది.
ఈసీ నిర్ధారించిన వ్యయానికి మించి గంగుల ఎన్నికల ఖర్చు చేశారని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు నేడు విచారణ జరిపింది. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. సరైన ఆధారాలు లేవంటూ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. మరోవైపు గంగుల ఎన్నికను రద్దు చేయాలంటూ బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టనుంది.
చదవండి: తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్
Comments
Please login to add a commentAdd a comment