సాక్షి, హైదరాబాద్: అత్యధిక ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలువనుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. వానాకాలం సీజన్‌లో సాగైన పంట విస్తీర్ణం ఆధారంగా ఈసారి కోటి మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటనలో తెలిపారు.
ధాన్యం సేకరణ కోసం ఈసారి 7100 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే... ఇప్పుడు కేవలం తెలంగాణలోనే కోటి టన్నుల ధాన్యం సేకరించే స్థాయికి రాష్ట్రం ఎదిగిందన్నారు. ధాన్యం కోసం అవసరమైన 25 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment