
కరీంనగర్: బీసీ సంక్షేమ శాఖమంత్రి గంగుల కమలాకర్ కరోనా బారిన పడ్డారు. స్వల్పంగా కరోనా లక్షణాలుండటంతో పరీక్ష చేయించుకోగా ఆయనకు పాజిటివ్ వచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తన ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారు ఐసోలేషన్‌లో ఉండాలని, కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని గంగుల సూచించారు.