కరీంనగర్: కరీంనగర్‌లో మళ్లీ కరోనా వైరస్ కలకలం రేగింది. ఒకేసారి 43 మంది విద్యార్థులు కరోనా బారిన పడటం స్థానికంగా ఆందోళన రేకెత్తిస్తోంది. చల్మెడ మెడికల్ కాలేజీలో 43 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దాంతో కాలేజీకి యాజమాన్యం సెలవులు ప్రకటించింది. ఈ క్రమంలోనే మిగతా వారికి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు కాలేజీ నిర్వాహకులు. ఒక పార్టీలో భారీగా విద్యార్థులు పాల్గొన్న తర్వాతే వీరంతా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంచితే, తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కేసులు లేవని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకూ ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని తెలిపింది. కాగా, 13 మంది శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్‌కు పంపినట్లు స్పష్టం చేసింది. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం పంపుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
రాజేంద్రనగర్ బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలోని పీరం చెరువులో కరోనా అలజడి సృష్టించిన సంగతి తెలసిందే. స్థానిక గిరిధారి అపార్ట్‌మెంట్‌లో 10 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇటీవల ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన అపార్ట్‌మెంట్ వాసికి కరోనా సోకింది. అనంతరం ఆ అపార్ట్‌మెంట్‌లో పలువురికి పరీక్షలు చేయగా మొత్తంగా 10 మందికి కరోనా సోకినట్లు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment