సాక్షి, హైదరాబాద్: మంత్రి గంగుల కమలాకర్ హుటాహుటిన దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరుతున్నట్టు తెలిసింది. మంగళవారమే కుటుంబసభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లిన మంత్రి గంగులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఇన్‌కమ్ టాక్స్ అధికారులు షాకిచ్చారు. తాళం వేసి ఉన్న ఆయన ఇంటి తలుపులను గ్యాస్ కట్టర్‌తో కట్ చేయించి మరీ లోనికి వెళ్లారు.
అధికారుల సోదాల విషయం ఫోన్‌లో తెలుసుకున్న గంగుల హుటాహుటిన హైదరాబాద్‌కు టికెట్‌లు బుక్ చేసుకున్నట్టు తెలిసింది. కరీంనగర్ లోని గంగుల ఇంటితో పాటు మరో నాలుగు చోట్ల, అలాగే బావుపేటలోని గ్రానైట్ పరిశ్రమల కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. వీటితో పాటు శ్వేతా గ్రానైట్ వ్యవహారాలు చూసుకుంటున్న మంత్రి గంగుల సోదరుడు గంగుల వెంకన్న ఇంట్లో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
చదవండి: (మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు)
('గంగుల ఇంటిపై ఈడీ దాడులు: మంత్రి రూ.749 కోట్ల పెనాల్టీ కట్టాలి')
Comments
Please login to add a commentAdd a comment