
తెలుగులో ఎన్నో చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న సత్యం రాజేష్ హీరోగా ఓ కొత్త ప్రాజెక్ట్‌కు సంతకం చేశాడు. మధు సూదన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా డిసెంబర్ 21న లాంఛనంగా ప్రారంభం కానుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ఎమోషన్స్, లవ్, సెంటిమెంట్ ఉండబోతున్నాయి.
రుద్రవీణ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న మధుసూదన్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండడం విశేషం. రియా సచ్చదేవా హీరోయిన్. త్వరలో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల కానున్నాయి.
చదవండి: రోడ్డు మీద తిరుగుతుంటే తిన్నావా? అని జాలిగా చూసేవారు
Comments
Please login to add a commentAdd a comment