క్రియేటివిటితో పాటు అవి ఉంటేనే విజయం వరిస్తుంది: దిల్‌ రాజు | Dil Raju Speech At Dada Saheb Phalke School of Film Studies 6th Convocation Celebration | Sakshi
Sakshi News home page

క్రియేటివిటితో పాటు అవి ఉంటేనే విజయం వరిస్తుంది: దిల్‌ రాజు

Published Sun, Jun 18 2023 4:29 PM | Last Updated on Sun, Jun 18 2023 4:29 PM

Dil Raju Speech At Dada Saheb Phalke School of Film Studies 6th Convocation Celebration - Sakshi

క్రియేటివిటితో పాటు కృషి, పట్టుదల, అంకితభావం ఉన్నవారిని మాత్రమే సినిమారంగం విజయాలు అందిస్తుందని నిర్మాత దిల్‌ రాజు అన్నారు. ప్రముఖ దర్శకుడు ‘అంకురం’ ఉమామహేశ్వరరావు సారథ్యంలో నిర్వహించబడుతున్న ‘దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్’ 6వ స్నాతకోత్సవం  ఆదివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. నటన, దర్శకత్వం, ఛాయాగ్రహణం, ఎడిటింగ్ వంటి పలు విభాగాల్లో సుశిక్షితుల్ని చేస్తూ... సినిమా రంగానికి అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సంస్థ స్నాతకోత్సవానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా దిల్‌ రాజు మాట్లాడుతూ..రాణించాలనే పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా సక్సెస్‌ కావొచ్చు అన్నారు.తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం, దర్శకనిర్మాత డాక్టర్ గౌతమ్ విశిష్ట అతిధులుగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. "దాదా సాహెబ్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్" డీన్ మధు మహంకాళి, ప్రిన్సిపాల్  నందన్ బాబు సమక్షంలో విద్యార్థినీ విద్యార్థులకు దిల్ రాజు సర్టిఫికెట్స్, పతకాలు అందించారు. శిక్షణలో భాగంగా స్టూడెంట్స్ తెరకెక్కించిన లఘుచిత్రాలపై అతిథులు ప్రశంసల జల్లు కురిపించారు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement