100 ఏళ్ల మన సినిమా | 100-year-old in our film | Sakshi
Sakshi News home page

100 ఏళ్ల మన సినిమా

Published Mon, Sep 23 2013 12:22 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM

100-year-old in our film

 సినిమా.. ఓ అద్భుతం.. ఓ చారిత్రాత్మకం.. మానవ జీవనశైలి, ఆలోచనలు, ఆహార్యం.. చివరికి మానవసంబంధాలపైనా తనదైన ముద్రవేసిన ఊహా ప్రపంచం. భారతీయ ప్రజల వినోదక్షేత్రంలో విస్తరించిన సినీ ప్రపంచానికి వందేళ్లు పూర్తయ్యూరుు. భారతీయ సినిమా ఆవిర్భావం దాదా సాహెబ్ ఫాల్కే చేసిన తొలి స్వదేశీ చిత్రం ‘రాజా హరిశ్చంద్ర’తో జరిగింది. నూరేళ్ల కిందట అంటే 1931 మే 3న      ఆ చిత్రం విడుదలైంది. కేవలం మూగచిత్రాలతో మొదలైన భారతీయ సినిమా 1931లో హెచ్‌ఎం రెడ్డి తీసిన ‘భక్తప్రహ్లాద’ తొలి టాకీ సినిమాగా జన సామాన్యానికి చేరువైంది. రఘుపతి వెంకయ్యనాయుడు, గూడవల్లి రామ  బ్రహ్మం, ఎల్వీ ప్రసాద్ తదితరుల విశేషకృషితో ముందుకు   సాగిన తెలుగు సినిమా కేవీ రెడ్డి, బీఎన్ రెడ్డి, చక్రపాణి వంటి మహనీయుల నీడలో  విస్త­ృతమైంది. భారతీయ సినీ వినీలాకాశంలో తెలుగువారు ధ్రువతారల పాత్ర పోషించారు. 1950 తరువాత మనజిల్లాకు చెందిన ఎందరో నటీనటులు తమదైన ముద్రతో సినీ ప్రపంచాన్ని విస్తరించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌తోపాటు ఎస్వీఆర్, సావిత్రి, కన్నాంబ, కనకం, కైకాల సత్యనారాయణ, శోభన్‌బాబు, కోట శ్రీనివాసరావు వంటి మేటినటులు తెలుగు కీర్తిపతాకను అంతర్జాతీయంగా ఎగుర వేశారు. ప్రస్తుతం చెన్నైలో వందేళ్ల సినీ వేడుకలు జరుపుకొంటున్న నేపథ్యంలో మనజిల్లా తారాప్రస్థానాన్ని పరికిస్తే..
 
 నటసింహం.. రాజకీయ దిగ్గజం..
 చిత్తశుద్ధి ఉన్నవారికి లక్ష్యసిద్ధి లభిస్తుంది. విజయం వరిస్తుంది. చరిత్ర కీర్తిస్తుంది. ఇది నందమూరి తారక రామారావు జీవిత, నట, రాజకీయ జీవిత వైవిధ్యాలను విశ్లేషిస్తే వచ్చే సారాంశం. అప్పటి గుడివాడ నియోజకవర్గం నిమ్మకూరులో 1923 జనవరి 28న జన్మించిన ఎన్టీఆర్ విజయవాడలో చదువుకునే రోజుల్లో కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ప్రోత్సాహంతో రంగస్థల ప్రవేశం చేశారు. ‘రాచమల్లుని దౌత్యం’ నాటకంలో నాగమ్మ పాత్రను మీసాలు తీయకుండా పోషించి మీసాల నాగమ్మగా పేరు పొందారు. నేషనల్ ఆర్ట్ థియేటర్ స్థాపించి ‘వేనరాజు విప్లవం’ నాటకాన్ని ప్రదర్శించారు. కొద్దిరోజులు సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఎన్టీఆర్ అక్కడ పద్ధతులు నచ్చక మద్రాస్ చేరుకున్నారు. 1949లో ఎల్వీ ప్రసాద్ ప్రోత్సాహంతో ‘మనదేశం’ చిత్రంలో ఇన్‌స్పెక్టర్ పాత్రతో సినీరంగ ప్రవేశం చేశారు. నాటినుంచి 1996లో కీర్తిశేషులయ్యే వరకు దాదాపు 300 చిత్రాలలో ధీరోదాత్తంగా నటించారు. 1983లో రాజకీయరంగ ప్రవేశంచేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యూరు.
 
 ఎవర్‌గ్రీన్ హీరో..
 నటనలో అక్కినేని నాగేశ్వరరావుది ప్రత్యేక స్టరుుల్. 1924 సెప్టెంబర్ 20న గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో జన్మించిన అక్కినేని, చిన్ననాటి నుంచే నాటకరంగంవైపు ఆకర్షితులయ్యారు. అనేక నాటకాల్లో నాయిక పాత్రలు పోషించారు. 1940లో విడుదలైన ‘ధర్మపత్ని’ ఆయన నటించిన మొదటి చిత్రం. అయితే, పూర్తిస్థాయిలో కథానాయకుడిగా నటించిన చిత్రం 1944లో వచ్చిన ‘శ్రీసీతారామ జననం’. అందులో రాముడిగా నటించారు. నాటి నుంచి నేటి వరకు తిరుగులేని మహానటుడిగానే నిలిచిపోయారు. మనిషిగా, సంఘజీవిగా కూడా అక్కినేని తనవంతు కృషిచేశారు. గుడివాడలో జూనియర్ కళాశాల నిర్మాణానికి భూరి విరాళం అందించారు. సుడిగుండాలు, మరో ప్రపంచం వంటి సందేశాత్మక చిత్రాలను నిర్మించారు.
 
 నటనా యశస్వి ఎస్వీఆర్


 సంభాషణలతో నిమిత్తం లేకుండా కంటిచూపుతో, ముఖ కవళికల విన్యాసంతో పాత్రపరంగా నటనను ఆవిష్కరించిన ఏకైక నటుడు సామర్ల వెంకట రంగారావు (ఎస్వీఆర్). జులై 3, 1918న నూజివీడులో జన్మించిన రంగారావు విద్యార్థి దశలోనే రంగస్థలంపై నటించారు. కొద్దికాలం ఫైర్ ఆఫీసర్‌గా పనిచేసిన ఆయన నటనే ప్రాణంగా జీవించేవారు. ఆయన బంధువైన బీవీ రామానందం తీసిన వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యుడి పాత్ర పోషించారు. ఆ తరువాత మనదేశం, షావుకారు, పల్లెటూరి పిల్ల చిత్రాల్లో చిన్నచిన్న వేషాలు ధరించిన రంగారావుకు పాతాళభైరవి రూపంలో అదృష్టం తలుపుతట్టింది. నాటి నుంచి 1974 జులైలో చనిపోయే నాటికి 150 తెలుగు, 87 తమిళ, రెండు కన్నడ, మూడు మలయూళ, మూడు హిందీ చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన నర్తనశాల చిత్రం విదేశాల్లో కూడా ప్రదర్శితమై మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది.
 
 
 సోగ్గాడు శోభనాద్రి


 1959లో విడుదలైన ‘దైవబలం’ చిత్రంలో ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ఉప్పు శోభనాచలపతిరావు (శోభన్‌బాబు) 1937 జనవరి 14వ తేదీన జి.కొండూరు మండలంలోని కోడూరు పక్కన చిన నందిగామలో జన్మించారు. హైస్కూల్ విద్య మైలవరంలోనూ, ఇంటర్మీడియెట్ బెజవాడ ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీలోనూ, బీఎస్సీ గుంటూరు ఏసీ కాలేజీలోనూ పూర్తిచేశారు. తన 20వ సినిమా ‘వీరాభిమన్యు’లో హీరోగా అభిమన్యుడి వేషంలో నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు. వెంటనే            ‘లోగుట్టు పెరుమాళ్లకెరుక’ సినిమాలో సోలో హీరోగా నటించారు. 1969లో విడుదలైన ‘మనుషులు మారాలి’ చిత్రం సిల్వర్ జూబ్లీ ఆడటంతో శోభన్‌బాబు నట జీవితంలో మైలురాయిగా మారింది. మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య కథానాయకుడిగా వెలుగొందారు. ఆయన విజయవాడ వస్తే రామకృష్ణాపురంలోని కోడూరు రాజు ఇంటికే వెళ్లేవారు.
 
 విలక్షణ నటుడు కైకాల


 విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కైకాల సత్యనారాయణ బంటుమిల్లి గ్రామం లో 1935 జులై 25వ తేదీన జన్మించారు. 1959లో ‘సిపాయి కూతురు’ చిత్రంలో తొలిసారిగా నటించారు. విఠాలాచార్య ‘కనకదుర్గ పూజామహిమ’ చిత్రంలో ప్రతినాయకుడిగా వేషంవేసి ఏళ్లపాటు తిరుగులేని నటుడిగా కొనసాగారు.. కొనసాగుతు న్నారు. 1996లో రాజకీయాల్లోకి ప్రవేశించి మచిలీపట్నం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
 
 సినీ పరిశ్రమకు కంచు‘కోట’


 తెలుగు ప్రేక్షకులు ముద్దు గా కోటా అని పిలుచుకునే కోట శ్రీనివాసరావు 1945 జులై 10న కంకిపాడులో జన్మించారు. సినిమాల్లోకి రాకముందు ఎస్‌బీఐలో పనిచేశారు. 20ఏళ్ల రంగస్థల అనుభవంతో సినిమాల్లోకి ప్రవేశించారు. 1978-79 సంవత్సరంలో ‘ప్రాణం ఖరీదు’ నాటకం వేస్తుండగా నిర్మాత, దర్శకుడు క్రాంతికుమార్ చూసి ఆ నాటకాన్ని సినిమాగా తీశారు. అలా.. కోటా సినీరంగప్రవేశం జరిగింది. ఇప్పటికీ వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్నారు.
 
 నాటి మేటి కథానారుుక సావిత్రి


 ఏ హీరోతో నటించినా తన పాత్రకు అసాధారణ నటనా ప్రజ్ఞతో ప్రాణంపోసి కేవలం ముఖకవళికల ద్వారా, కంటిచూపుతో, పంటి విరుపుతో నవరసాలను సమసామర్థ్యంతో పోషించి మెప్పించిన మేటి మహానటి సావిత్రి విజయవాడలోనే పుట్టారు. 1936 డిసెంబర్ 6న జన్మించిన సావిత్రి నాట్యం, నటనలో శిక్షణ పొంది అనేక ప్రదర్శనలిచ్చారు. 1950లో ‘సంసారం’ చిత్రంలో చిన్న పాత్రలోనూ, ‘పాతాళభైరవి’లో ఒక నృత్య సన్నివేశంలోనూ నటించారు. 1952లో ‘పల్లెటూరు’ చిత్రంలో నాయికగా తొలిసారి నటించారు. ఆ వెంటనే ‘దేవదాసు’లోని పార్వతి వేషంతో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చారుు. పుష్కరకాలం తెలుగు, తమిళ సినీపరిశ్రమలో తిరుగులేని కథానాయికగా వెలుగొందారు. ప్రేక్షకులను తన నటనతో కనువిందు చేశారు. నటనలో విజయం సాధించిన సావిత్రి జీవితంలో మాత్రం మోసపోరుు 1981 డిసెంబర్ 26న కన్నుమూశారు.
 
 వీరేకాకుండా.. తొలితరం కథానారుుకలు కన్నాంబ, కనకం, నటుడు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, హీరోలు రాజేంద్రప్రసాద్, మురళీమోహన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణ, నేటితరం కథానాయికలు లయ, రంభ, హాస్యనటులు గుండు హనుమంతరావు, కళ్లు శ్రీనివాస్, పిళ్లా ప్రసాద్, రఘునాథరెడ్డి, కోట శంకర్రావు మనజిల్లా నుంచి సినీరంగంలోకి వెళ్లినవారే.. ఉయ్యూరుకు చెందిన పరుచూరి బ్రదర్స్ సినీపరిశ్రమలో తిరుగులేని రచయితలుగా వెలుగొందుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement