పద్మావత్‌..పైసా వసూల్‌.. | Bhansali's period drama passes crucial Monday test, film earns Rs 129 cr | Sakshi
Sakshi News home page

పద్మావత్‌..పైసా వసూల్‌..

Published Tue, Jan 30 2018 6:02 PM | Last Updated on Tue, Jan 30 2018 8:03 PM

Bhansali's period drama passes crucial Monday test, film earns Rs 129 cr - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వివాదాల నడుమ విడుదలైన సంజయ్‌ లీలా భన్సాలీ చారిత్రక చిత్రం పద్మావత్‌ నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరింది. సహజంగా తొలి వారాంతం దాటిన తర్వాత వసూళ్లు నెమ్మదించడం జరిగే క్రమంలో పద్మావత్‌ మూవీ సోమవారం గండం నుంచి విజయవంతంగా గట్టెక్కింది. ప్రపంచవ్యాప్తంగా పద్మావత్‌ మూవీ కలెక్షన్లు నిలకడగా ఉన్నాయని ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు.

సోమవారం బాక్సాఫీస్‌ వద్ద రూ 15 కోట్లు కొల్లగొట్టిన పద్మావత్‌కు దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ 129 కోట్ల వసూళ్లు దక్కాయని ట్వీట్‌ చేశారు. ఆస్ట్రేలియా, బ్రిటన్‌, న్యూజిలాండ్‌ సహా ఓవర్సీస్‌లోనూ పద్మావత్‌ భారీగా వసూలు చేస్తోందని చెప్పారు. ఈ మూవీలో రాణి పద్మినిగా దీపికా పదుకోన్‌ నటన ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement