పద్మావత్‌ తొలి రోజు వసూళ్లు ఎంతంటే.. |  Deepika film packs a solid punch | Sakshi
Sakshi News home page

పద్మావత్‌ తొలి రోజు వసూళ్లు ఎంతంటే..

Published Fri, Jan 26 2018 7:38 PM | Last Updated on Fri, Jan 26 2018 7:38 PM

 Deepika film packs a solid punch - Sakshi

సాక్షి, ముంబయి : వివాదాల నడుమ విశ్వవ్యాప్తంగా విడుదలైన సంజయ్‌ లీలా భన్సాలీ చారిత్రక చిత్రం పద్మావత్‌ తొలిరోజు భారీగా కలెక్షన్లను కొల్లగొట్టింది. పలు రాష్ట్రాల్లో హిందూ సంస్థలు, రాజపుత్రుల ఆందోళనలు కొనసాగినా వసూళ్లపై వాటి ప్రభావం కనిపించలేదు. నిరసనల భయంతో కొన్ని చోట్ల పలు థియేటర్లు ఈ మూవీని ప్రదర్శించేందుకు వెనుకాడినా బాక్సాఫీస్‌ వద్ద మూవీ తొలిరోజు సంతృప్తికర వసూళ్లు సాధించింది.

తొలిరోజు పద్మావత్‌ మూవీకి దాదాపు రూ. 20 కోట్ల వసూళ్లు దక్కాయి. టాక్‌ బాగుండటంతో ముందుముందు కలెక్షన్లు మరింత మెరుగవుతాయని భావిస్తున్నారు. పద్మావత్‌లో టైటిల్‌ రోల్‌ పోషించిన దీపికా పదుకోన్‌ నటనకు పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి. ఇక రణ్‌వీర్‌సింగ్‌, షాహిద్‌ కపూర్‌లూ తమదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement