
న్యూఢిల్లీ: పద్మావత్ సినిమా విడుదలపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఎట్టి పరిస్థితుల్లో మార్చబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పును గౌరవించాలన్న విషయం ప్రజలకు అర్థం కావాలని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం పేర్కొంది.
పద్మావత్’ విడుదలపై తీర్పును మరోసారి పరిశీలించాలని రాజస్తాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును రాష్ట్రాలు పాటించాలని ఆదేశించింది. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని స్పష్టం చేసింది.
సినిమాను నిలిపేయాలని రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన, అఖిల భారతీయ క్షత్రియ మహాసభ దాఖలు చేసిన పిటిషన్‌లను కూడా ధర్మాసనం కొట్టేసింది. దీంతో జనవరి 25న పద్మావత్ విడుదలకు అడ్డంకులు తొలగి పోయాయి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన పద్మావత్‌లో రణవీర్ సింగ్, దీపికా పదుకొణె, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment