
కండలు కరిగాయి. హెయిర్ స్టైల్ కంప్లీట్‌గా మారింది. గడ్డం, మీసాలు ట్రిమ్ అయ్యాయి. ఫేస్‌లో కోపం పోయి అమాయకత్వం వచ్చింది. ఇక్కడున్న ఫొటోల్లో మధ్య తేడాలు చెప్పమంటే బహుశా.. ఇలాగే చెప్పుకుంటామేమో. కానీ పేరులో మాత్రం ఏ మార్పు లేదు. ఇతని పేరు రణ్‌వీర్‌సిం గ్. ‘జిందగీ నా మిలేగీ దొబారా’ జోయా అక్తర్ దర్శకత్వంలో రణ్‌వీర్‌సింగ్ హీరోగా రూపొందుతున్న తాజా సినిమా ‘గల్లీ బాయ్’. ఇందులో ఆలియా భట్ కథానాయిక. ఈ సినిమాలోని కంప్లీట్ లుక్‌ను ‘పద్మావత్ టు గల్లీ బాయ్ ’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రణ్‌వీర్. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ‘పద్మావత్’ చిత్రంలోని ఖిల్జీ పాత్రకు భారీగా బరువు పెరిగిన రణ్‌వీర్ ‘గల్లీబాయ్’ కోసం బరువు తగ్గారు.
అన్నట్లు... ఎన్నో వివాదాల నడుమ రూపొంది, ఎన్నో అడ్డంకుల మధ్య ‘పద్మావత్’ ఈ 25న విడుదల కానుంది. సుప్రీమ్ కోర్టు అన్ని రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయొచ్చని అనుమతి ఇచ్చినప్పటికీ ఇంకా కొన్ని చోట్ల విడుదల చేయకూడదనే వివాదం సాగుతోంది. కొన్ని థియేటర్ల ముందు ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి.. విడుదల రోజున ఏం జరుగుతుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment