'అనవసర కామెంట్స్ చేయను' | Don't want to make unnecessary comments: Ekta on 'Udta' row | Sakshi
Sakshi News home page

'అనవసర కామెంట్స్ చేయను'

Published Wed, Jun 8 2016 6:39 PM | Last Updated on Mon, Sep 4 2017 2:00 AM

'అనవసర కామెంట్స్ చేయను'

'అనవసర కామెంట్స్ చేయను'

ముంబై: 'ఉడ్తా పంజాబ్' సినిమా వివాదంపై స్పందించేందుకు నిర్మాత ఏక్తా కపూర్ నిరాకరించింది. ఈ వివాదంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదని తెలిపింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు 89 కట్స్ చెప్పడంతో దుమారం రేగింది. సహ నిర్మాత అనురాగ్ కశ్యప్ బహిరంగంగా సెన్సార్ బోర్డుపై ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో అనురాగ్- ఏక్తా కపూర్ మధ్య విభేదాలు తలెత్తాయని, ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకోనున్నారని వార్తలు కూడా వచ్చాయి.

దీనిపై స్పందించేందుకు  ఏక్తా నిరాకరించింది. 'మా అభిప్రాయాలను అధికార ప్రతినిధి ద్వారానే వెల్లడించాలని నేను, కశ్యప్ నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈ వివాదంపై నేను మాట్లాడను. ఈ సమస్యకు సామరస్య పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నా. నేను అనవసరంగా ఎటువంటి కామెంట్స్ చేయన'ని స్పష్టం చేసింది. మర్డర్ మిస్టరీగా తెరకెక్కిన తన తాజా చిత్రం 'ఎ స్కాండల్' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆమె పాల్గొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement