హీరోలు భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడం చూస్తూనే ఉన్నాం. సినిమా హిట్టయిందంటే రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. ఒకప్పుడు లక్షల్లో ఉండే పారితోషికం ఇప్పుడు కోట్లల్లోనే ఉంది. స్టార్ హీరోలైతే వంద కోట్లపైనే అందుకుంటున్నారు. ఇదంతా పక్కనపెడితే ఓ హీరోకు వంట చేసే మనిషి రూ.2 లక్షలు డిమాండ్ చేయడమే విడ్డూరంగా ఉందంటున్నాడు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్.
రోజుకు రూ.2 లక్షలు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. 'ఓ హీరో చెఫ్ రోజుకు రూ.2 లక్షలు ఇవ్వమని అడిగేవాడు. అతడు చేసే వంట ఓ పక్షి తినేంత ఉంటుందంతే! ఇదేంటి..? మరీ ఏదో పక్షికి వేసినట్లు ఇంత తక్కువ పెడితే ఏం సరిపోతుందన్నాను. అయితే ఆ హీరోకు ఏదో అనారోగ్య సమస్య ఉందట.. అందుకోసమని తక్కువ పరిమాణంలోనే తినాలని చెప్పాడు. ఈ మాత్రం దానికి రూ.2 లక్షలు ఇవ్వాలా? అనిపించింది.
టెక్నీషియన్ల కన్నా ఎక్కువ
హెయిర్, మేకప్ ఆర్టిస్టులు కూడా రోజుకు రూ.75,000 డిమాండ్ చేస్తున్నారు. సినిమా కోసం పని చేసే టెక్నీషియన్లు కూడా అంత సంపాదించలేరు. ఇలాంటి పనికిమాలిన డిమాండ్లు ఎక్కువ అవడానికి కారణం నిర్మాతలే! వాళ్లు అడిగినదానికల్లా తలూపడం ముమ్మాటికీ తప్పే! నా సినిమాలో అయితే ఈ రకమైన డిమాండ్స్ అస్సలు ఒప్పుకోను' అని చెప్పుకొచ్చాడు.
సినిమా..
కాగా అనురాగ్ కశ్యప్.. దేవ్.డి, గులాల్, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ 1 & 2, బాంబే టాకీస్, రామన్ రాఘవ్ 2, దొబారా, కెన్నడీ వంటి పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు. పలు చిత్రాలకు రచయితగా, నిర్మాతగా పని చేశాడు. ఘూంకెటు, హడ్డీ, మహారాజ వంటి చిత్రాల్లో యాక్ట్ చేశాడు. బ్యాడ్ కాప్ అనే వెబ్ సిరీస్‌లో విలన్‌గా కనిపించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment