బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నటీనటులను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. కొందరు నటీనటులు సమంజసం కాని డిమాండ్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. షూటింగ్ సమయంలో కొంతమంది నటులు వ్యక్తిగత చెఫ్‌లను నియమించుకోవడానికి ఇష్టపడతారని అన్నారు. అంతే కాదు.. వారి చెఫ్‌కు ఒక్క రోజుకు ఏకంగా రూ.2 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఆసక్తికర కామెంట్స్ చేశారు. వారి డిమాండ్స్ చాలా హాస్యాస్పదంగా ఉంటాయని కశ్యప్ వెల్లడించారు. అయితే ఎవరనేది మాత్రం పేర్లు వెల్లడించలేదు.
కొందరు నటులు తమకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. అందుకే వారు చెఫ్ వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారని కశ్యప్ అన్నారు. అంతే కాకుండాహెయిర్, మేకప్ ఆర్టిస్టులు రోజుకు రూ.75,000 వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇది సాంకేతిక నిపుణుల కంటే ఎక్కువని కశ్యప్ పేర్కొన్నాడు. తాను హెయిర్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ అయి ఉంటే ఇప్పటికే ధనవంతుడు అయ్యి ఉండేవాడినని తెలిపారు.
ఇదంతా నిర్మాతలు, వారి ఏజెంట్ల తప్పు వల్లే జరుగుతోందని.. నిర్మాతలు ఇలాంటి వారిని సెట్స్‌పై ఎందుకు అనుమతిస్తారో నాకు అర్థం కావడం లేదన్నారు. కానీ నా సెట్స్‌లో ఇలాంటివి జరగవని చెప్పాడు. కొద్ది రోజుల క్రితమే షూటింగ్ సెట్‌కు మైళ్ల దూరంలో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ నుంచి బర్గర్ తీసుకురావాలని తమ డ్రైవర్‌ను ఓ నటుడు కోరినట్లు కశ్యప్ తెలిపారు. ఇలాంటి ఖర్చులు సినిమా మొత్తం నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు.కాగా.. కశ్యప్ ఇటీవలే బాడ్ కాప్ సిరీస్‌లో నటించాడు. ఇందులో గుల్షన్ దేవయ్యకు విలన్‌గా నటించారు.
Comments
Please login to add a commentAdd a comment