బాలీవుడ్‌కు ఏదో శని పట్టుకున్నట్లే ఉంది. వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న హిందీ పరిశ్రమకు ఊపిరిపోద్దామనుకున్న బడా డైరెక్టర్లు, స్టార్ హీరోల ఆశ అత్యాశే అయింది. బస్తీమే సవాల్ అంటూ బాక్సాఫీస్ బరిలో దిగిన ఎన్నో పెద్ద సినిమాలు అట్టర్ ఫ్లాప్‌గా నిలిచాయి. తాజాగా ఈ జాబితాలో తాప్సీ కొత్త మూవీ దొబారా వచ్చి చేరింది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం (ఆగస్టు 19న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అనూహ్యంగా కేవలం 2 నుంచి మూడు శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ అవుతున్నాయట.
అసలు జనాలే రాకపోవడంతో చాలావరకు షోలు క్యాన్సిల్ చేసుకుంటున్నారట. మహా అయితే ఈ సినిమా మొదటి రోజు రూ.30 లక్షలు, ఫుల్ రన్‌లో కోటిన్నర రూపాయలు రాబడుతుందని అంచనా వేస్తున్నారు అక్కడి సినీవిశ్లేషకులు. నిజానికి సినిమా ప్రమోషన్స్‌లో బాయ్‌కాట్ ట్రెండ్‌పై తాప్సీ, అనురాగ్‌లు స్పందిస్తూ.. దొబారా మూవీని కూడా బాయ్‌కాట్ చేయాలని కోరారు. అన్నట్లే ఆ సినిమాను ఆదరించే నాదుడే కరువయ్యాడు. కాగా దొబారా సినిమా 2018లో వచ్చిన మిరేగ్ అనే స్పానిష్ సినిమాకు రీమేక్.
For Me….#Dobaaraa is a Successful film, it SUCCESSFULLY MADE ME SLEEP inside the theatre also made me believe in TIME TRAVEL because I wanted to go back in time when I purchased the ticket for the film… 1.5*/5 ⭐️ ½ #DobaaraaReview #AnuragKashyap #TaapseePannu pic.twitter.com/XPFIuaelTz
— Rohit Jaiswal (@rohitjswl01) August 19, 2022
#Dobaaraa is off to a DISASTROUS start at the box office, film is registering merely 2-3% occupancy while many early shows are getting canceled due to NO AUDIENCE..
— Sumit Kadel (@SumitkadeI) August 19, 2022
చదవండి: బుల్లితెర తారలతో నిండిన 'వాంటెడ్ పండుగాడ్' మూవీ రివ్యూ
స్టార్ హీరోల సినిమాలను వెనక్కునెట్టిన నిఖిల్ మూవీ
Comments
Please login to add a commentAdd a comment