వెబ్ సిరీస్‌లోని కొన్ని సన్నివేశాల దృశ్యాలు
ముంబై : ‘నువ్వు నన్ను అసహ్యించుకుంటున్నావ్ అని నాకు తెలుసు. కానీ అలా చేయవద్దు. సీన్ మరింత బాగా రావడానికి మరోసారి న్యూడ్(నగ్నం)గా కనిపించాలని’ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పలుమార్లు చెప్పారని నటి కుబ్రా సైత్ అన్నారు. హాలీవుడ్‌లో విజయవంతమైన వెబ్ సిరీస్‌ల బాటలో ఇటీవల టాలీవుడ్, బాలీవుడ్‌లోనూ కొందరు దర్శకులు ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో వచ్చిన బాలీవుడ్ వెబ్ సిరీసే సాక్రిడ్ గేమ్స్.
జాతీయ మీడియా ‘టైమ్స్ నౌ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుబ్రా సైత్ మాట్లాడుతూ.. ‘నేను ఈ వెబ్ సిరీస్‌లో కుక్కూ అనే ట్రాన్స్‌జెండర్ పాత్ర పోషించాను. కొన్ని సీన్లలో నేను నగ్నంగా కనిపించాల్సి ఉంటుందని దర్శకుడు అనురాగ్ కశ్యప్, కో డైరెక్టర్ విక్రమాదిత్య మోత్వానీ ముందుగానే చెప్పారు. అయితే వచ్చిన చిక్కేంటంటే.. నగ్నంగా నటించిన సన్నివేశాన్ని పలుమార్లు చిత్రీకరించేవారు. సీన్ ముగిసిన ప్రతిసారి మరో టేక్ చేద్దామనేవారు. ఇలా కనీసం 7సార్లు అలాంటి సీన్లు చిత్రీకరించారు. ఆ సమయంలో నేను దాదాపు ఏడ్చేశాను.
ఆ సీన్లు పలుమార్లు తీస్తున్నానని తప్పుగా భావించవద్దని, సీన్ మరింత అందంగా, ఆకర్షణీయంగా రావడానికి అలా చేయాల్సి వచ్చిందని కశ్యప్ చెప్పేవారు. నువ్వు నన్ను అసహ్యించుకుంటున్నావని తెలుసునని, అయితే దయచేసి ఆ పని చేయవద్దని కశ్యప్ పదే పదే నన్ను అడిగేవారు. వెబ్ సిరీస్ విడుదలయ్యాక ఆ సీన్లు చూసి చాలా బాగా తీశారు. న్యూడ్ సీన్లను కూడా చాలా అందంగా చిత్రీకరించారు. మంచి టీమ్‌తో పని చేశానని మీరు భావిస్తారని’ అనురాగ్ కశ్యప్ తనతో చర్చించేవారని నటి కుబ్రా సైత్ వివరించారు. 1980, 90 దశాబ్దాలలో ముంబైలో గ్యాంగ్‌స్టర్స్, పోలీసుల మధ్య జరిగే దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు.
సాక్రిడ్ గేమ్స్ వెబ్ సిరీస్‌లో సైఫ్ అలీఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే, కుబ్రా సైత్‌ల నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో వెబ్ సిరీస్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment