
స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను ప్రస్తుతం తన తాజా చిత్రం ‘దొబారా’ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 19న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ అనురాగ్‌తో కలిసి తాప్సీ ఓ చానల్ ఇంటర్య్వూకు హాజరైంది. ఈ సందర్భందగా అనురాగ్ తాప్సీపై చేసిన వల్గర్ కామెంట్స్ ప్రస్తుతం హాట్‌టాపిక్ నిలిచాయి. ఈ సందర్భంగా యాంకర్ రణ్‌వీర్ సింగ్ నగ్న ఫొటోషూట్‌పై మీ అభిప్రాయం ఏంటని అనురాగ్ కశ్యప్‌ను ప్రశ్నించాడు. దీనిపై డైరెక్టర్ స్పందిస్తూ.. అది తనకు నచ్చిందని, ప్రస్తుతం ఇలాంటివి సర్వసాధారణమని బదులిచ్చాడు.
చదవండి: ఆనందం కంటే బాధే ఎక్కువగా ఉంది: అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు
అయితే మీరు కూడా ట్రై చేయండి.. ఆ ఫొటోషూట్ బాగా వైరల్ అవుతుందంటూ యాంకర్ చమత్కిరించాడు. దీంతో తాప్సీ మధ్యలో మాట్లాడుతూ.. ప్లీజ్ హారర్ షోకు తెరలేపకండి అని సరదాగా కామెంట్స్ చేసింది. ఇక తాప్సీ కామెంట్స్‌కు రియాక్ట్ అయిన దర్శకుడు అనురాగ్.. నువ్వేందుకు భయపడుతున్నావ్.. ‘హో తనకంటే నా బూ** పెద్దగా ఉంటాయి.. అందుకే తను అసూయ పడుతుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక అతడి కామెంట్‌కి కాస్తా ఇబ్బంది పడ్డ తాప్సీ ఆ తర్వాత లైట్ తీసుకుని నవ్వేసింది. దీంతో నెట్టింట ఈ వీడియో వైరల్‌గా మారింది. అనురాగ్ అంత అసభ్యంగా కామెంట్స్ చేయడంతో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇక తాప్సీ రియాక్షన్ చూసి ఆమెను తప్పుబడుతూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment