
ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ త్వరలో పెళ్లి చేసుకోబోతుందా? అంటే అవుననే అంటున్నాయి సినీవర్గాలు. అందుకు కారణం లేకపోలేదు. ఆలియా, షేర్ గ్రెగోయిర్ ఒకరికి ఒకరు ముద్దులు పెట్టుకుంటున్న ఫొటోలను వారివారి సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా షేన్.. 'నా ప్రియాతిప్రియమైన దేవతకు హ్యాపీ సెకండ్ యానివర్సరీ. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, పార్ట్‌నర్ మాత్రమే కాదు, నా సర్వస్వం నువ్వే! నిత్యం నాకోసం సమయం కేటాయిస్తూ నాకు సంతోషాన్ని పంచుతున్నందుకు చాలా సంతోషం. ఐ లవ్యూ, నిజం చెప్పాలంటే నీ వేలికి ఎప్పుడెప్పుడు ఉంగరం తొడుగుదామా? అని తెగ ఆరాటపడుతున్నాను' అని రాసుకొచ్చాడు. షేన్ ఆదుర్దా చూస్తోంటే కాలం కలిసొస్తే త్వరలోనే వీరు పెళ్లి చేసుకోనున్నట్లు కనిపిస్తోంది. కాగా ఆలియా, షేన్ తొలిసారిగా డేటింగ్ యాప్‌లో కలుసుకున్నారు. అప్పటి నుంచి వీరు డేటింగ్ చేసుకుంటున్నారు. వీరిద్దరూ కలిశారంటే చాలు రొమాంటిక్ ఫొటోలు దిగి వాటిని అభిమానులతో పంచుకుంటారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment