
పాక్ నటి ఉస్నా షా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త జీవితంలోకి అడుగుపెట‍్టింది. తమ దేశానికి చెందిన గోల్ఫ్ ప్లేయర్ హమ్జా అమీన్ తో నిఖా చేసుకుంది. అయితే ఈ వేడుకలో ఉస్నా.. ఎర్రని లెహంగా ధరించడం సోషల్ మీడియాలో అప్పట్లో పెద్ద రచ్చ అయింది. భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఈమె డ్రస్ వేసుకోవడాన్ని కొందరు తప్పుబట్టారు. ఇప్పుడు ఏకంగా తన పెళ్లి జరగడానికి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కారణమని బయటపెట్టింది.
పాకిస్థాన్‌కు చెందిన ఉస్నా షా.. సినిమాలు, సీరియల్స్ తో చాలా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కాస్త బిజీగానే ఉంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తో తాను దిగిన ఫొటోని ఇప్పుడు ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆయన్ని జీనియస్ అని మెచ్చుకుంటూనే.. తన పెళ్లి జరగడానికి ఈ దర్శకుడే కారణమని చెప్పుకొచ్చింది. అయితే అది ఎప్పుడూ ఎలా అనేది మాత్రం బయటపెట్టలేదు. పాక్ నటికి బాలీవుడ్ డైరెక్టర్ తో ఎక్కడా ఎలా పరిచయం అయిందా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారిపోయింది.
(ఇదీ చదవండి: నటిపై దాడి.. ఆ విషయమై గొడవ జరగడంతో!)
Comments
Please login to add a commentAdd a comment