బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన కూతురు ఆలియా కశ్యప్ వివాహాబంధంలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ కాగా.. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ముంబయిలో గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన ఈ వేడుకలో సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులంతా కలిసి సందడి చేశారు. ఈ హల్దీ వేడుకలో జాన్వీకపూర్ సిస్టర్ ఖుషీ కపూర్ అందమైన దుస్తులు ధరించి మెరిసింది. ఈ ఫోటోలను అనురాగ్ కశ్యప్ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. అనురాగ్ కశ్యప్ తన కుమార్తెతో వివాహానికి ముందు అభిషేక్ బచ్చన్ నటించిన ఐ వాంట్ టు టాక్ సినిమాని చూడటానికి తండ్రీకూతుళ్లిద్దరూ వెళ్లారు.
కాగా.. ఆలియా కశ్యప్ కొంతకాలంగా షేన్‌తో డేటింగ్ చేస్తోంది. వీరిద్దరూ డేటింగ్ యాప్ ద్వారానే పరిచయమయ్యారు. ఆమె సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కావడంతో తన సోషల్ మీడియా ఖాతాల ప్రమోషన్స్ చేస్తోంది. అంతేకాకుండా ఆమె యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోలను కూడా పోస్ట్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment