![డాక్యుమెంటరీలే నయమంటున్న అనురాగ్ కాశ్యప్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/51437072001_625x300.jpg.webp?itok=CjMzeU3S)
డాక్యుమెంటరీలే నయమంటున్న అనురాగ్ కాశ్యప్
ఇటీవలి కాలంలో సినిమాల కంటే డాక్యుమెంటరీలే నయంగా ఉంటున్నాయని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ అంటున్నారు. దివంగత పాప్ గాయని అమీ వైన్‌హౌస్‌పై రూపొందించిన ‘అమీ’ డాక్యుమెంటరీని తిలకించిన తర్వాత కాశ్యప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కథాచిత్రాలతో పోలిస్తే, ఇటీవలి కాలంలో వస్తున్న డాక్యుమెంటరీలే ప్రభావశీలంగా ఉంటున్నాయని ఆయన అన్నారు.