
సామాజిక కోణంలో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు అనురాగ్ కశ్యప్. వ్యక్తిగతంగానూ అలాంటి వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. రాజకీయ అంశాలపై అనురాగ్ స్పందించే తీరు వివాదాస్పదమైన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఈ స్టార్ డైరెక్టర్ ట్విటర్‌కు గుడ్ బై చెప్పారు. తన కారణంగా తన కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు.
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తిన అనురాగ్ చాలా సందర్భంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యారు. ‘దొంగలు రాజ్యమేలుతారు, దుర్మార్గం జీవన విదానం అవుతుంది. సరికొత్త భారతదేశంలో నివసిస్తున్న అందరికీ శుభాకాంక్షలు. మీరు అభివృద్ధిలోకి వస్తారు. నేను నా అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తపరచలేనపుడు నేను మౌనంగానే ఉండిపోతాను గుడ్ బై’ అంటూ చివరి ట్వీట్ చేశారు అనురాగ్.