ఓపక్క సినిమాలు, మరోపక్క వెబ్ సిరీస్‌లు చేస్తూ జోరు మీదుంది బాలీవుడ్ నటి అమృత సుభాష్. ద మిర్రర్, లస్ట్ స్టోరీస్ 2లోనూ యాక్ట్ చేసిన ఈమె తాజాగా తనకు షూటింగ్‌లో ఎదురైన ఓ ఆసక్తికర సంఘటనను చెప్పుకొచ్చింది. 'నేను సాక్ర్‌డ్ గేమ్స్ 2 సిరీస్‌లో తొలిసారి శృంగార సన్నివేశాల్లో నటించాను. ఈ సీన్స్ షూట్ చేయడానికి ముందు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అప్పుడు నన్ను ఓ ప్రశ్న అడిగాడు.
నీ పీరియడ్స్ డేట్ ఎప్పుడు? అని ప్రశ్నించాడు. నాకు కొద్ది క్షణాలపాటు ఏం అర్థం కాలేదు. అతడు తిరిగి.. నీ డేట్ ఎప్పుడో చెప్తే మనం ఇంటిమేట్ సీన్స్‌కు ఆ రోజుల్లో కాకుండా ఇతర రోజుల్లో షెడ్యూల్ సర్దుబాటు చేద్దాం అన్నాడు. డైరెక్షన్ టీమ్‌తో మాట్లాడి షెడ్యూల్‌లో మార్పుచేర్పులు చేశాడు. అతడు చాలా మృదుస్వభావి. నటీనటులను ఎంతగానో అర్థం చేసుకుంటాడు' అని చెప్పుకొచ్చింది అమృత.
కాగా అమృత సుభాష్ సాక్ర్‌డ్ గేమ్స్ రెండో సీజన్‌లో రా ఏజెంట్‌గా నటించింది. అలాగే కొంకణ సేన్ దర్శకత్వం వహించిన ద మిర్రర్‌లోనూ యాక్ట్ చేసింది. అయితే ఇందులో తన పాత్ర గురించి చెప్పినప్పుడు ఏదీ తన బుర్రకు ఎక్కలేదట. ఒకరకంగా అదే మేలంటోంది అమృత. తన పాత్ర గురించి పూర్తిగా తెలిసిపోతే రిలాక్స్ అయిపోతామని, అదే కాస్త సందిగ్ధంగా ఉంటే దాని గురించి తెలుసుకునేందుకు, అందులో లీనమైపోయేందుకు మరింత కష్టపడతామని చెప్తోంది.
చదవండి: కాలు విరగ్గొట్టుకున్న నవదీప్
Comments
Please login to add a commentAdd a comment