బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత అనురాగ్ కశ్యప్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు నటి పాయల్ ఘోష్. ‘ప్రయాణం’ సినిమాలో కథానాయికగా నటించిన ఆమె ‘ఊసరవెల్లి’ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించారు. ‘‘అనురాగ్ నాతో చాలా తప్పుగా ప్రవర్తించాడు. పని (సినిమా) చేయాలని వస్తే అన్నింటికీ సిద్ధపడి వచ్చినట్టు కాదు. అనురాగ్ మీద చర్యలు తీసుకోవాలి’ అని ట్వీట్ చేశారు పాయల్. ఇంకా మాట్లాడుతూ – ‘‘ఈ ఘటన 2014–15 ప్రాంతంలో జరిగింది. అప్పుడు ‘నాకు అమితాబ్ బచ్చన్‌తో పరిచయాలున్నాయి. నాతో పని చేసిన వేరే హీరోయిన్లు నాతో బాగా క్లోజ్‌గా ఉండేవారు’ అని అనురాగ్ చెప్పేవారు’’ అని కూడా పాయల్ అన్నారు.
పాయల్ ఆరోపణలకు మద్దతుగా కంగనా రనౌత్ మాట్లాడారు. ‘‘అనురాగ్‌ను అరెస్ట్ చేయండి. పాయల్‌తో అనురాగ్ ఏ విధంగా ప్రవర్తించాడో అది బాలీవుడ్‌లో ఎప్పటినుండో జరుగుతోంది. అవకాశాల కోసం వచ్చే అవుట్‌సైడర్స్‌ను సెక్స్ వర్కర్స్‌లా చూడటం ఇక్కడ అలవాటే’’ అని ట్వీటర్‌లో స్పందించారు కంగనా.
తన మీద వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, అవన్నీ అవాస్తవాలని అనురాగ్ కశ్యప్ స్పందించారు. ‘‘నేను ప్రేమించిన, పెళ్లి చేసుకున్న, నాతో పని చేసిన ఏ నటిని, ఫీమేల్ టెక్నీషియన్‌ని అడిగినా నా గురించి చెబుతారు. వీళ్లు కాకుండా నేను వేరే పనుల మీద కలిసే ఏ అమ్మాయిని అడిగినా నేనేంటో చెబుతారు. మీరు ఆరోపించే విధంగా నేనెప్పుడూ ప్రవర్తించలేదు. అలా తప్పుగా ప్రవర్తించేవాళ్లను ప్రోత్సహించను కూడా. ఇదంతా నా నోరు మూయించడానికే’’ అని పేర్కొన్నారు కశ్యప్.
అనురాగ్ కశ్యప్‌కు మద్దతుగా ఆయనతో పని చేసిన తాప్సీ, పలువురు దర్శకులు నిలిచారు. ‘‘నాకు తెలిసిన అతిపెద్ద స్త్రీ వాది (అనురాగ్‌ని ఉద్దేశించి) నువ్వే. మనిద్దరం మరో గొప్ప ఆర్ట్ సృష్టించడానికి కలసి పని చేద్దాం’’ అని ఆయన్ను సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు తాప్సీ. బాలీవుడ్ చిత్రాల ఎడిటర్, అనురాగ్ కశ్యప్ భార్య ఆర్తీ బజాజ్ పాయల్ చేసిన ఆరోపణలను ‘చీప్’ అని కొట్టేపారేశారు. ‘‘ఒకరి మీద ద్వేషం చిందించడానికి పెట్టే శ్రమను ప్రేమించడానికి పెడితే ఈ ప్రపంచం ఎంతో బావుంటుంది. నోరు తెరిచి మాట్లాడేవాళ్లందర్నీ అణచివేయాలనుకుంటున్నారా? అనురాగ్... నీ సినిమాల్లో అందరూ సురక్షితంగా పని చేసే విషయం నాకు తెలుసు’’ అని పేర్కొన్నారు ఆర్తీ బజాజ్. అలాగే అనురాగ్ కశ్యప్‌తో పని చేసిన పలువురు ఆయనకు మద్దతుగా నిలిచారు.
అంతా అబద్ధం: అనురాగ్ కశ్యప్
Published Mon, Sep 21 2020 4:11 AM | Last Updated on Mon, Sep 21 2020 8:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment