కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి నటించిన మహారాజ సినిమా రీసెంట్‌గా 100 రోజులు పూర్తి చేసుకుంది. దీంతో చెన్నైలో సెలబ్రేషన్స్ జరిగాయి. జూన్ 14న విడుదలైన ఈ చిత్రాన్ని దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ ఓటీటీలో కూడా మంచి ఆదరణ లభించింది. సినిమా విజయం పట్ల మేకర్స్ ఫుల్ ఖుషి అయ్యారు.
మహారాజా చిత్రాన్ని ది రూట్, థింక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. విజయ్ సేతుపతి 50వ చిత్రంగా కోలీవుడ్‌లో విడుదలైంది. రూ. 20 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 110 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో చిత్ర నిర్మాతలు 100 డేస్ ఫంక్షన్ జరిపారు. ఈ క్రమంలో దర్శకుడు నిథిలన్ స్వామినాథన్‌కు నిర్మాతలు సర్‌ప్రైజ్ ఇచ్చారు. బీఎండబ్ల్యూ కారును విజయ్ సేతుపతి చేతుల మీదుగా గిఫ్ట్‌గా అందించారు.
ఇదీ చదవండి: బెయిల్ విషయంలో జానీ మాస్టర్‌కు షాకిచ్చిన పోలీసులు
ఈ క్రమంలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. నిథిలన్ స్వామినాథన్ మేకింగ్, రైటింగ్‌పై ప్రశంసలు కురిపించారు. సినిమాకు ఇంతటి గుర్తింపు రావడం వెనుక నిథిలన్ శ్రమ ఎక్కువుగా ఉందని కొనియాడారు. ఈ సినిమా చూసిన వారందరూ కూడా తనను ఎంతోమంది ప్రశంసించారని విజయ్ సేతుపతి గుర్తుచేసుకున్నారు. టీమ్ సహకారంతోనే మహారాజ సినిమా విజయం సాధ్యమైందని ఆయన తెలిపారు.
తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై ఒక తండ్రి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడో అనే కథను దర్శకుడు చాలా ఆసక్తిగా చెప్పాడు. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగే మహారాజ చిత్రంలో విజయ్ సేతుపతితో పాటు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడిగా కనిపించారు. మమతా మోహన్‌దాస్, అభిరామి, దివ్య భారతి కీలకపాత్రలలో మెప్పించారు. నెట్‌ఫ్లిక్స్‌లో మహారాజ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment