Junior NTR Reveals 10 Special Trains For Andhrawala Audio Launch: జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమా ఫంక్షన్లలకు అభిమానులు భారీగా హాజరవుతుంటారు. అయితే తారక్ నటించిన మోస్ట్ అవేటెడ్ చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్). ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో అభిమానులను పెంచుకునే పనిలో పడ్డాడు తారక్. ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం, థియేటర్ ఆక్యుపెన్సీలో ఆంక్షల వంటి పలు కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. అంతకుముందు మాత్రం ఈ మూవీ ప్రమోషన్స్‌ను భారీగా చేసింది చిత్రబృందం. ఈ క్రమంలోనే ప్రముఖ హిందీ కామెడీ టాక్ షో 'ది కపిల్ శర్మ షో'లో పాల్గొన్నారు తారక్, రామ్ చరణ్, రాజమౌళి, అలియా భట్.
ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఈవెంట్స్‌కు అభిమానులు ఎలా వస్తారో చెప్పాలని హోస్ట్ కపిల్ శర్మ అడిగాడు. అందుకు ఎన్టీఆర్ తాను 2004లో నటించిన ఆంధ్రావాలా చిత్రం ఆడియో లాంచ్‌కు అభిమానులు ఎలా వచ్చారో తెలిపారు. అప్పుడు ప్రభుత్వం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసిన విధానం గురించి పేర్కొన్నారు. 'నా ఆంధ్రావాలా ఆడియో లాంచ్‌కు సుమారు 9 నుంచి 10 లక్షల మంది అభిమానులు వచ్చారు. వారికోసం ప్రభుత్వం 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది.' అని తారక్ వెల్లడించారు. ఆంధ్రావాలా సినిమాను డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
About #Andhrawala Audio launch 🔥#NTR @RRRMovie @tarak9999 pic.twitter.com/x9sYS7dIZK
— NTR ARMY (@NTRARMYOFFICIAL) January 2, 2022
ఇదీ చదవండి: అలియా భట్ నవ్వు.. నెటిజన్ల ట్రోలింగు..
Comments
Please login to add a commentAdd a comment