
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’.

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది. జూన్ 1న చెన్నైలో సినీ ప్రముఖులు సమక్షంలో ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకకు హీరో శింబు, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, నెల్సన్, నిర్మాత ఏ ఎం రత్నం, ఏసియన్ సినిమాస్ సునీల్ నారంగ్, భరత్ నారంగ్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ కార్యక్రమంలో శృతి హాసన్, మౌనీ రాయ్, శంకర్ కూతరు అదితీ శంకర్, కొడుకు అర్జిత్ శంకర్ లైవ్ పర్ఫామెన్స్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి.





































