సార్‌ ఆడియో లాంచ్‌: స్టేజీపై పాట పాడిన ధనుష్‌ | Dhanush Sings a Song In Sir Audio Launch | Sakshi
Sakshi News home page

Dhanush: ఇద్దరు కొడుకులతో ఆడియో లాంచ్‌కు ధనుష్‌.. వైరలవుతున్న ఫోటోలు

Published Mon, Feb 6 2023 10:58 AM | Last Updated on Mon, Feb 6 2023 11:14 AM

Dhanush Sings a Song In Sir Audio Launch - Sakshi

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ కథానాయకుడిగా తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న చిత్రం ధాత్రి. తెలుగులో సార్‌ అనే పేరును నిర్ణయించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 17వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతుంది.

ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చెన్నైలోని ఓ ప్రైవేట్‌ కళాశాల ఆవరణలో చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ధనుష్‌ ప్రస్తుతం నటిస్తున్న కెప్టెన్‌ మిల్లుల చిత్ర గెటప్‌లో రావడం విశేషం. మరో విషయం ఏంటంటే ఆయన ఇద్దరు వారసులు లింగ, యాత్ర పాల్గొనడం మరో విశేషం. వేదిక ముందు ధనుష్‌కు ఇరువైపులా ఆయన కొడుకులు కూర్చోవడంతో ఫొటోగ్రాఫర్లు కెమెరాలతో క్లిక్‌మనిపించారు. కాగా వేదికపై ధనుష్‌ చిత్రంలోని పాటను పాడి అభిమానులను అలరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్ర కథను వెంకీ తనకు లాక్‌డౌన్‌ టైంలో చెప్పారన్నారు. కథ నచ్చడంతో ఓకే చెప్పానన్నారు. ఇది 1990లో జరిగే కథ చిత్రంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా వడచెన్నై పార్ట్‌– 2 ఉంటుందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ఈ విషయం దర్శకుడు వెట్రిమారన్‌ను అడగాలని, అయితే సీక్వెల్‌ మాత్రం కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు.

చదవండి: పెళ్లి బిజీలో కియారా అద్వానీ, డ్యాన్సింగ్‌ టైం అంటున్న చరణ్‌
నయనతారను పొగిడిన షారుక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement