సార్‌: ధనుష్‌ అభిమానులకు స్వీట్‌ సర్‌ప్రైజ్‌ | Reprise Version of Dhanush Mastaaru Mastaaru Song Released | Sakshi
Sakshi News home page

Sir Movie: అభిమానుల మనసులు మరోసారి గెలిచిన మాస్టారు.. వీడియో..

Published Thu, Feb 23 2023 5:04 PM | Last Updated on Thu, Feb 23 2023 7:19 PM

Reprise Version of Dhanush Mastaaru Mastaaru Song Released - Sakshi

హీరో ధనుష్‌ నటించిన ద్విభాషా చిత్రం సార్‌ ఘనవిజయం సాధించింది. సంయుక్త మీనన్‌ కథానాయికగా నటించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. తెలుగులో సార్‌గా తమిళంలో వాతిగా ఫిబ్రవరి 17న రిలీజైన ఈ చిత్రానికి విశేష స్పందన లభించింది. అతి తక్కువ సమయంలోనే బ్రేక్‌ ఈవెన్‌ దాటడంతో చిత్రయూనిట్‌ విజయోత్సవ సభ నిర్వహించింది. తాజాగా సార్‌ మూవీ టీమ్‌ ఫ్యాన్స్‌కు ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

ఈ సినిమాలో మాస్టారు మాస్టారు పాట ఎంత హిట్టో తెలిసిందే కదా! తాజాగా ధనుష్‌ ఈ పాట తమిళ లిరిక్స్‌ను స్వయంగా రాసి ఆలపించాడు. ఈ సాంగ్‌ వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్‌ చేయగా ఇది చూసిన అభిమానులు మీ యాక్టింగ్‌లోనే కాదు గొంతులోనూ ఏదో మ్యాజిక్‌ ఉందని కామెంట్లు చేస్తున్నారు. కాగా తెలుగులో జోగి రామయ్యశాస్త్రి రాసిన ఈ పాటను ధనుష్‌ ఆలపించగా ఈ వీడియోను కాస్త ఆలస్యంగా రిలీజ్‌ చేశారు.

చదవండి: కమెడియన్‌తో నటి పెళ్లి.. వైరల్‌గా మారిన ఫోటోలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement