తమిళసినిమా: నృత్య దర్శకుడు దినేష్,యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం లోకల్ సరుకు. నటి ఉపాసన నాయకిగా నటించిన ఈ చిత్రానికి ఎస్పీ రాజ్‌కుమార్ దర్శకత్వం వహించారు. యువ సంగీత దర్శకుడు స్వామినాథన్ రాజేష్ నిర్మాతగా మారి నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. ఈయన కరోనా కాలంలో వేలాది మందికి పలు రకాలుగా సాయం చేశారు. అందులో సినీ రంగానికి చెందిన వారు ఉన్నారు. అలా సినిమా నిర్మించాలని ఆలోచన వచ్చిందట. ఆ చిత్రమే లోకల్ సరుకు అని బుధవారం ఉదయం వడపళణిలోని కమలా థియేటర్లో జరిగిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. యువ సంగీత దర్శకుడు స్వామినాథన్ రాజేష్ నిర్మాతగా మారి నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది.
ఈయన కరోనా కాలంలో వేలాది మందికి పలు రకాలుగా సాయం చేశారు. అందులో సినీ రంగానికి చెందిన వారు ఉన్నారు. అలా సినిమా నిర్మించాలని ఆలోచన వచ్చిందట. ఆ చిత్రమే లోకల్ సరుకు అని బుధవారం ఉదయం వడపళణిలోని కమలా థియేటర్లో జరిగిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. ఇది మంచి సందేశంతో కూడిన ప్రేమ కథా త్రం అని చెప్పారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి, నిర్మాత, నటుడు కె.రాజన్, నటుడు రాధారవి, సంగీత దర్శకుడు శంకర్ గణేష్, విజయ్‌మురళి, గిల్డ్ అధ్యక్షుడు జాగ్వర్ తంగం, పెప్సీ శివ, గీత రచయిత స్నేహన్, నటి ఇనియ, సంగీత కళాకారుల సంఘం అధ్యక్షుడు దినా తదితరులు పాల్గొన్నారు.
నటుడు కె.రాజన్ మాట్లాడుతూ సంగీత దర్శకుడిగా ఎదుగుతున్న రాజేష్ నిర్మితగా మారి ఈ చిత్రాన్ని నిర్మించారన్నారు. అయితే తమిళ సినీ రంగంలో నిర్మాతకు విలువ లేదని అందుకే ఆర్‌బీచౌదరి వంటి వారు కూడా ఇప్పుడు తమిళంలో చిత్రాలు చేయకుండా తెలుగులో నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. రాజేష్‌కు ఇచ్చే సలహా ఏంటంటే సంగీత దర్శకుడిగా బాగా పేరు తెచ్చుకున్న తర్వాత నిర్మాతగా చిత్రాలలో చేయాలన్నారు. లోకల్ సరుకు చిత్ర ట్రైలర్ పాటలు బాగున్నాయని తెలిపారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment