పొన్నియిన్  సెల్వన్  తీయాలంటే ధైర్యం కావాలి | Ponniyin Selvan trailer and audio release ceremony held in Chennai | Sakshi
Sakshi News home page

పొన్నియిన్  సెల్వన్  తీయాలంటే ధైర్యం కావాలి

Published Fri, Mar 31 2023 5:14 AM | Last Updated on Fri, Mar 31 2023 5:14 AM

Ponniyin Selvan trailer and audio release ceremony held in Chennai - Sakshi

‘‘పొన్నియిన్  సెల్వన్ ’ చిత్రాన్ని తీయాలంటే ధైర్యం కావాలి.. అది డైరెక్టర్‌ మణిరత్నం, నిర్మాత సుభాస్కరన్ గార్లకు ఉంది. అందుకే ఈ చిత్రం అద్భుతంగా తెరకెక్కింది’’ అని ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ అన్నారు. ఐశ్వర్యా రాయ్, విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, త్రిష ప్రధాన పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’. సుభాస్కరన్ , మణిరత్నం నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 28న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది.

ఈ సినిమా ట్రైలర్, ఆడియో విడుదల వేడుకని చెన్నైలో నిర్వహించారు. ఈ మూవీ ఆడియోను కమల్‌ హాసన్  విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘పొన్నియిన్  సెల్వన్ ’ నవల రాసిన కల్కీని చూసి ఇతర రచయితలు అసూయ పడుతున్నట్లుగా, మణిరత్నంగారిని చూసి రచయితలు, దర్శకులు అసూయ పడుతున్నారు.. వారిలో నేనూ ఒకణ్ణి. ఈ మూవీలో నటించే అవకాశం నాకు మిస్‌ అయ్యింది.

తమిళ చిత్ర పరిశ్రమకు ఇది స్వర్ణయుగమే. దీన్ని కాపాడుకోవాలి. ‘పొన్నియిన్  సెల్వన్  2’ ఘన విజయం సాధించాలి’’ అన్నారు. ఈ వేడుకలో తమిళనాడు రాష్ట్ర మంత్రి దురైమరుగన్, దర్శకుడు భారతీరాజా, నటుడు శింబు, నటి ఐశ్వర్యారాయ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్  సంగీతం అందించగా, రవివర్మన్  కెమెరామేన్‌గా పనిచేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement