
సాక్షి, హైదరాబాద్: భారీ పంచ్‌లు, ముష్టిఘాతాలకు నెలవైన డబ్ల్యూడబ్ల్యూఈ ప్రేక్షకుల నుంచి అమితాదరణను పొందుతోంది. డబ్ల్యూడబ్ల్యూఈకి చెందిన రెజిల్‌మానియా 35 టోర్నమెంట్ పెద్ద సంఖ్యలో అభిమానులను ఆకర్షించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సూపర్ స్టార్లు తలపడిన ఈ పోటీలకు ప్రేక్షక లోకం కళ్లప్పగించింది. న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగిన ఈ పోటీలను మెట్‌లైఫ్ స్టాండ్స్ నుంచి దాదాపు 82,000కు పైగా అభిమానుల ప్రత్యక్షంగా వీక్షించారు. ఇదే కాకుండా సోనీ టెన్–1, సోనీ టెన్–3, సోనీ సిక్స్ చానళ్ల ద్వారా భారత్‌లోని అభిమానులు ఈ క్రీడా వినోదాన్ని ఆస్వాదించారు. మెగా ఫ్యాన్స్ కోసం ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నైలోని పీవీఆర్ మాల్స్‌లో ఈ పోటీలను భారీ స్క్రీన్‌లపై ప్రదర్శించారు. చరిత్రాత్మకమైన ఈ రెజిల్‌మానియా తొలిసారిగా మహిళల మ్యాచ్‌లను నిర్వహించింది.
Comments
Please login to add a commentAdd a comment