
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే ఈ సినిమాను అడ్డుకునేందుకు టీడీపీ వర్గాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. అయినా వర్మ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. తనదైన స్టైల్‌లో ప్రచారంలో దూసుకుపోతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో భారీ ఈవెంట్‌కు సంబంధించి ప్రకటన చేశాడు వర్మ.
‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆడియో రిలీజు ఈవెంట్ కడపలో ఒక గొప్ప బహిరంగ సభలో చెయ్యబడుతుంది.. ఈవెంట్ పేరు ‘వెన్ను పోటు’ అలియాస్ ఎన్టీఆర్ నైట్. ఈవెంట్ డేటు అతి త్వరలో తెలియచేయబడుతుంది.. జై ఎన్టీఆర్’ అంటూ ట్వీట్ చేశాడు వర్మ. అగస్త్య మంజుతో కలిసి వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాకు రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరిలు నిర్మాతలు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆడియో రిలీజు ఈవెంట్ కడప లో ఒక గొప్ప బహిరంగ సభలో చెయ్యబడుతుంది ..ఈవెంట్ పేరు
— Ram Gopal Varma (@RGVzoomin) 16 March 2019
“వెన్ను పోటు” అలియాస్ ఎన్టీఆర్ నైట్ .
ఈవెంట్ డేటు అతి త్వరలో తెలియచెయ్యబడుతుంది ..జై ఎన్టీఆర్ #LakshmiNTR pic.twitter.com/ocVYUrkD6t