Perarasu Shocking Comments On Tik Tok Women Videos, Goes Viral - Sakshi
Sakshi News home page

Perarasu: 'అరాచకాలు చూడలేకపోతున్నాం.. ఆ మహిళలను అరెస్ట్‌ చేయాలి'

Published Thu, Jan 6 2022 5:49 PM | Last Updated on Thu, Jan 6 2022 7:10 PM

Director Perarasu Shocking Comments On Tik Tok Women Videos - Sakshi

Director Perarasu Shocking Comments On Tik Tok Women Videos: పురుషుల వల్ల మహిళలకు వేధింపులు ఎక్కువ అవుతున్నాయని అనుకుంటారు. కానీ కొందరు మహిళలు టిక్‌టాక్‌ వీడియోల్లో చేస్తున్న అరాచకాలు చూడలేకపోతున్నాం అని ప్రముఖ డైరెక్టర్‌ పేరరసు అన్నారు.  రెయిన్‌బో ప్రొడక్షన్స్‌ బ్యానరులో నిర్మాత వరదరాజ్‌ నిర్మించిన ‘పెణ్‌ విలై వెరుం రూ.999 మట్టుమే’ఆడియో ఫంక్షన్లో పాల్గొన్న  ఆయన మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు మహిళలే కారణమన్నారు. టిక్‌టాక్‌ వంటి షేరింగ్‌ యాప్స్‌లో అసభ్యకర, అశ్లీల వీడియోలు షేర్‌ చేసే మహిళలను గుర్తించి అరెస్ట్‌ చేయాలని కాంట్రవర్సీ కామెంట్స్‌ చేశారు. అంతేకాకుండా దేశ సంస్కృతి, సంప్రదాయాలు మంటగలిసి పోవడానికి మొబైల్‌ ఫోన్స్‌ కారణమని, అందువల్ల పిల్లలకు తల్లిదండ్రులు ఫోన్లు ఇవ్వొద్దని సూచించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను వ్యతిరేకిస్తూ రూపొందించిన సినిమా పెణ్‌ విలై వెరుం అని.. ఈ సినిమాను ఆధరించాలని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement