సైకలాజికల్​ థ్రిల్లర్​గా 'కూర్మన్'​.. | Koorman Movie Audio And Trailer Launch Programme In Chennai | Sakshi
Sakshi News home page

Koorman Movie: సైకలాజికల్​ థ్రిల్లర్​గా 'కూర్మన్'​..

Published Sun, Feb 6 2022 1:20 PM | Last Updated on Sun, Feb 6 2022 1:29 PM

Koorman Movie Audio And Trailer Launch Programme In Chennai - Sakshi

చెన్నై సినిమా: 'కూర్మన్‌' చిత్రం కొత్తగా ఉంటుందని దర్శకుడు బ్రయన్‌ బి. జార్జ్‌ అన్నారు. ఎంకె ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రాజాజీ, జనని అయ్యర్‌ జంటగా నటించారు. బాల సరవణన్‌, అడుగళం సరేన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. టోనీ బిట్టో సంగీతాన్ని, శక్తి అరవింద్‌ ఛాయాగ్రహణను అందించిన ఈ చిత్రం ఆడియో, ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం చెన్నైలో జరిగింది. 

ఇది మైండ్‌ రీడింగ్‌ ప్రధానాంశంగా రూపొందిన చిత్రమని, సైకలాజికల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో చిత్రం చాలా వైవిధ్యంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement