టైటిల్‌ బాగుంది | Undiporaadhey song launched by V V Vinayak | Sakshi
Sakshi News home page

టైటిల్‌ బాగుంది

Published Sat, Jul 13 2019 2:00 AM | Last Updated on Sat, Jul 13 2019 2:00 AM

Undiporaadhey song launched by V V Vinayak - Sakshi

శ్రీమతి సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో నవీన్‌ నాయని దర్శకత్వంలో డాక్టర్‌ లింగేశ్వర్‌ నిర్మించిన చిత్రం ‘ఉండిపోరాదే’. తరుణ్‌తేజ్, లావణ్య జంటగా నటించారు. ఈ చిత్రంలోని ఓ పాటను దర్శకుడు వి. వి వినాయక్‌ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘టైటిల్‌ బాగుంది. అలాగే సాబు వర్గీస్‌ ఇచ్చిన పాటలన్నీ చాలా బాగున్నాయి. సినిమా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు. డా. కె లింగేశ్వర్‌ మాట్లాడుతూ – ‘‘టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మా చిత్రం యూత్‌తో పాటు అన్ని వర్గాల వారికి తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు. నవీన్‌ నాయని మాట్లాడుతూ – ‘‘మంచి కంటెంట్‌తో పాటు సందేశాత్మక చిత్రంగా ‘ఉండి పోరాదే’ని తెరకెక్కించాం’’ అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement