ఉండిపోరాదే.. | undiporaadhey movie first look release | Sakshi
Sakshi News home page

ఉండిపోరాదే..

Published Sun, Jan 13 2019 12:34 AM | Last Updated on Sun, Jan 13 2019 12:34 AM

undiporaadhey movie first look release - Sakshi

లావణ్య

ఇటీవల ‘హుషారు’ సినిమాలో వినిపించిన ‘ఉండిపోరాదే’ సాంగ్‌ యూత్‌కి బాగా కనెక్ట్‌ అయ్యింది. ఇప్పుడు ‘ఉండిపోరాదే’ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. తరుణ్‌ తేజ్, లావణ్య హీరో హీరోయిన్లుగా సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో గోల్డ్‌ టైమిన్‌ పిక్చర్స్‌ పతాకంపై డాక్టర్‌ లింగేశ్వర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నవీన్‌ నాయని దర్శకునిగా పరిచయం కానున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది.

సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ‘‘కథలో కంటెంట్‌ స్ట్రాంగ్‌గా ఉంటే నటీనటులు కొత్తవారు అనే తేడాని ప్రేక్షకులు చూడరు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఫస్ట్‌ షెడ్యూల్‌ని పూర్తి చేశాం. ఈ నెల 28న సెకండ్‌ షెడ్యూల్‌ని ప్లాన్‌ చేశాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు. కెధార్‌ శంకర్, సత్య కృష్ణన్, సిద్ధిక్షా, అల్లు రమేష్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సాబు వర్గీస్‌ సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement