Tarun Teja
-
సరికొత్త అనుభూతినిస్తుంది
‘‘తరుణ్ తేజతో కలిసి మా అబ్బాయి బాపినీడు హారర్ జోనర్లో ‘అశ్విన్స్’ సినిమా నిర్మించాడు. ఈ చిత్రం విజువల్స్, సౌండింగ్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది’’ అని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ అన్నారు. వసంత్ రవి హీరోగా, విమలా రామన్ కీ రోల్లో నటించిన చిత్రం ‘అశ్విన్స్’. తరుణ్ తేజ దర్శకత్వంలో బాపినీడు బి. సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా తరుణ్ తేజ మాట్లాడుతూ– ‘‘అశ్విన్స్’ కాన్సెప్ట్‌తో ఓ షార్ట్ ఫిల్మ్ తీశాను. అది చూసిన బాపినీడుగారు అదే కాన్సెప్ట్‌ను ఫీచర్ ఫిల్మ్‌లా చేద్దామన్నారు. ప్రసాద్‌గారు, బాపినీడుగారి సహకారంతో ఈ సినిమా చేశాను’’ అన్నారు. ‘‘అశ్విన్స్’ తరుణ్ కల.. దాన్ని నెరవేర్చిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు విమలా రామన్. ‘‘తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘అశ్విన్స్’ వంటి మంచి చిత్రంతో రావటం హ్యాపీగా ఉంది’’ అన్నారు వసంత్ రవి. -
టైటిల్ బాగుంది
శ్రీమతి సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో నవీన్ నాయని దర్శకత్వంలో డాక్టర్ లింగేశ్వర్ నిర్మించిన చిత్రం ‘ఉండిపోరాదే’. తరుణ్‌తేజ్, లావణ్య జంటగా నటించారు. ఈ చిత్రంలోని ఓ పాటను దర్శకుడు వి. వి వినాయక్ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘టైటిల్ బాగుంది. అలాగే సాబు వర్గీస్ ఇచ్చిన పాటలన్నీ చాలా బాగున్నాయి. సినిమా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు. డా. కె లింగేశ్వర్ మాట్లాడుతూ – ‘‘టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మా చిత్రం యూత్‌తో పాటు అన్ని వర్గాల వారికి తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు. నవీన్ నాయని మాట్లాడుతూ – ‘‘మంచి కంటెంట్‌తో పాటు సందేశాత్మక చిత్రంగా ‘ఉండి పోరాదే’ని తెరకెక్కించాం’’ అన్నారు. -
ఆడపిల్లని తక్కువగా చూడకూడదు
‘‘ఓ తండ్రి కోసం కూతురు పాడే ఈ పాటలో చక్కటి విలువలున్నాయి. ఆడపిల్లని తక్కువగా చూడకూడదు.. ఆడపిల్ల పుట్టుక చాలా అవసరం.. అని తెలియజెప్పే ఈ పాట వల్ల కొంత మందైనా మారాలనుకుంటున్నాను’’ అని హీరో సుధీర్‌బాబు అన్నారు. తరుణ్ తేజ్, లావణ్య జంటగా నవీన్ నాయని దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఉండిపోరాదే’. గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ పతాకంపై డా.లింగేశ్వర్ నిర్మించిన ఈ సినిమా జూలై నెలాఖరులో విడుదలకానుంది. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా తండ్రి గొప్పతనాన్ని తెలియజేసే పాటను విడుదల చేశారు. నవీన్ నాయని మాట్లాడుతూ– ‘‘నన్ను నమ్మి డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చిన లింగేశ్వర్‌గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఇదొక రియలిస్టిక్ స్టోరీ. పక్కింటి అమ్మాయి జీవితం చూసినట్టుగా సినిమా ఉంటుంది. ఇటీవలే కన్నడలో మా ఆడియో విడుదలవగా, మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. డా.లింగేశ్వర్ మాట్లాడుతూ– ‘‘ఇంత వరకు వెండితెరపై రానటువంటి కథ ‘ఉండిపోరాదే’. సుద్దాల అశోక్‌తేజగారు నాన్నపై రాసిన పాటకు అవార్డ్స్ వస్తాయనడంలో సందేహం లేదు. ఎంత మంది వచ్చినా చివరి వరకు మనల్ని ప్రేమించేది మాత్రం తల్లిదండ్రులే అనే సందేశం ఉంటుంది. కథ మీద ఎంతో నమ్మకంతోనే ఈ చిత్రాన్ని మూడు భాషల్లో నిర్మి ంచా’’ అన్నారు. ‘‘ సుద్దాలగారు మంచి సాహిత్యం అందించారు. పాటకు చిత్రగారు ప్రాణం పోశారు’’ అని సంగీత దర్శకుడు సబు వర్గీస్ అన్నారు. తరుణ్ తేజ్, లావణ్య, నటుడు కేదార్ శంకర్, మాటల రచయిత సుబ్బారాయుడు బొంపెం తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీను విన్నకోట. -
ఇంతవరకూ రాని కథతో...
మన జీవితంలోకి ఎంతమంది వచ్చినా మనల్ని చివరివరకూ ప్రేమించేది తల్లిదండ్రులే అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ఉండిపోరాదే’. తరుణ్ తేజ్, లావణ్య హీరోహీరోయిన్లుగా తెలుగు, కన్నడ భాషల్లో నవీన్ నాయని దర్శకత్వంలో లింగేశ్వర్ నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ చిత్రం ఆడియోను 23న రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు సబు వర్గీస్ మాట్లాడుతూ– ‘‘సినిమాలో ప్రతి పాట సందర్భానుసారంగానే వస్తుంది. దర్శక–నిర్మాతలిచ్చిన స్వేచ్ఛ వల్ల మంచి పాటలివ్వగలిగాను’’ అన్నారు. ‘‘అవకాశమిచ్చిన నిర్మాతగారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఇదో రియలిస్టిక్ స్టోరీ. కన్నడలో ఆడియో రిలీజ్ చేశాం. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనుకుంటున్నాం’’ అన్నారు నవీన్. ‘‘సినిమాను ప్రత్యేక శ్రద్ధతో తీశాం. ఇంతవరకూ తెరమీద రానటువంటి కథతో సినిమా ఉంటుంది. నాన్నపై రాసిన పాటకు సుద్ధాల అశోక్ తేజగారికి కచ్చితంగా అవార్డ్ వస్తుంది. జులై చివర్లో సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత లింగేశ్వర్. -
తండ్రీ కూతుళ్ల అనుబంధం
తరుణ్ తేజ్, లావణ్య జంటగా నవీన్ నాయని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉండిపోరాదే’. డా.లింగేశ్వర్ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘తండ్రీ, కూతుళ్ల మధ్య అనుబంధంపై సినిమా అంటే ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఇటీవల కాలంలో చిన్న సినిమాలు, కొత్త వాళ్లతో చేసే సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఉండిపోరాదే...’ పాట ఎంతో ప్రజాదరణ పొందింది. దాన్ని సినిమా టైటిల్‌గా పెట్టడంతోనే సగం సక్సెస్ అయ్యారు దర్శక–నిర్మాతలు’’ అన్నారు ఏపీ ఫిల్మ్‌చాంబర్ సెక్రటరీ మోహన్ గౌడ్. నవీన్ నాయని మాట్లాడుతూ– ‘‘పక్కింటి అమ్మాయి జీవితం చూసినట్టుగా మా సినిమా ఉంటుంది. తండ్రీ కూతుళ్ల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా అందరికీ కనెక్ట్ అవుతూ, మనసులు కదిలించేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘మన జీవితంలో మధ్యలో ఎంత మంది వచ్చినా చివరి వరకూ మనల్ని ప్రేమించేది తల్లిదండ్రులే అనే సందేశంతో రూపొందిన చిత్రమిది’’ అని డా. లింగేశ్వర్ చెప్పారు. తరుణ్ తేజ్, లావణ్య, మాటల రచయిత సుబ్బారాయుడు బొంపెం, సంగీత దర్శకుడు సబు వర్గీస్ తదితరులు పాల్గొన్నారు. -
వాస్తవ కథ ఆధారంగా..
‘ఉండిపోరాదే.. గుండె నీదేలే.. హత్తుకోరాదే.. గుండెకే నన్నే...’ అనే పాట తెలుగు రాష్ట్రాల్లోని యూత్ గుండెలకు ప్రేమగా హత్తుకుంది. ఆ పాటలోని మొదటి పదం ‘ఉండిపోరాదే’ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. తరుణ్ తేజ్, లావణ్యలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ సత్యప్రమీల కర్లపూడి సమర్పణలో డా.లింగేశ్వర్ నిర్మాతగా నవీన్ నాయిని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఉండిపోరాదే’. కేదార్ శంకర్, అజయ్ ఘోష్, సత్యకృష్ణన్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ‘‘15 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. మనసుని హత్తుకొనే సన్నివేశాలు, ఊహించని ముగింపుతో కన్నీరు తెప్పించే విధంగా ఈ సినిమా ఉంటుంది. రాజమండ్రి, మైసూర్, హైదరాబాద్ ప్రాంతాల్లో ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మిగిలిన 20 శాతం హైదరాబాద్, అండమాన్ దీవుల్లో జరిపే షూటింగ్‌తో సినిమా పూర్తవుతుంది’’ అన్నారు చిత్రబృందం. సాబు వర్గీస్ సంగీతం అందిస్తున్నారు. జూన్ నెలలో చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ఉండిపోరాదే..
ఇటీవల ‘హుషారు’ సినిమాలో వినిపించిన ‘ఉండిపోరాదే’ సాంగ్ యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ‘ఉండిపోరాదే’ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. తరుణ్ తేజ్, లావణ్య హీరో హీరోయిన్లుగా సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో గోల్డ్ టైమిన్ పిక్చర్స్ పతాకంపై డాక్టర్ లింగేశ్వర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నవీన్ నాయని దర్శకునిగా పరిచయం కానున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘కథలో కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటే నటీనటులు కొత్తవారు అనే తేడాని ప్రేక్షకులు చూడరు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఫస్ట్ షెడ్యూల్‌ని పూర్తి చేశాం. ఈ నెల 28న సెకండ్ షెడ్యూల్‌ని ప్లాన్ చేశాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు. కెధార్ శంకర్, సత్య కృష్ణన్, సిద్ధిక్షా, అల్లు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సాబు వర్గీస్ సంగీతం అందిస్తున్నారు. -
ఒకే ఒక ఆశతో...
అందరూ కొత్తవారితో తీసిన ‘ఒకే ఒక ఆశ’ చిత్రం విజయవంతం కావాలని సీనియర్ నటి కవిత అభిలషించారు. తరుణ్ తేజ, శరత్ అలి, శ్రీలేఖ, హరిత ముఖ్యపాత్రల్లో శ్రీలత నాయుడు సమర్పణలో సర్వోదయ మూవీస్ పతాకంపై పరాంకుశం రవి కుమార్ దర్శకత్వంలో జాని, చిన్నయ్య దొర నిర్మించిన చిత్రం ‘ఒకే ఒక ఆశ’. ఈ సినిమా పాటల సీడీని కవిత విడుదల చేశారు. ‘‘ఈ చిత్రానికి నేనే పాటలు స్వరపరిచాను. ఏప్రిల్ మొదటివారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని దర్శకుడు తెలిపారు. కెమేరా మ్యాన్ ఎస్ రైసాబ్, సహ నిర్మాతలు పి.పద్మజ, పి. శ్రీలత నాయుడు తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.